యాప్నగరం

Mulugu Horoscope: నవంబరు 14 రాశి ఫలాలు- ఓ రాశివారి చర్చలు ఫలిస్తాయి!

శ్రీకాళహస్తి దేవస్థాన పండితుడిగానూ, ఖగోళ, వాస్తు శాస్త్రాల్లో నిష్ణాతుడిగానూ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారికి విశేష ఆదరణ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయన జ్యోతిషంపై అపారమైన నమ్మకం.

Samayam Telugu 14 Nov 2018, 6:04 am
మేషం
Samayam Telugu astrology2

ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి వివాదాలను ఆదిలోనే పరిష్కరించుకుంటారు. విందువినోదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి.

వృషభం
న్యాయంగా రావలసిన ధనాన్ని అందుకోగలుగుతారు. ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు అమలు చేస్తారు. పర్యవేక్షణ లోపం లేకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. లక్ష్మీతామరవత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధనచేయండి.

మిథునం
చర్చలు ఫలిస్తాయి. ప్రజాసంబంధాలు మరింతగా వృద్ధి చెందుతాయి. సామాజిక సేవాకార్యక్రమాల కోసం చందాలను వసూలు చేస్తారు. కళా, సాంస్కృతిక రంగాల పట్ల అభిరుచిని కనబరుస్తారు. నాగబంధం ఉపయోగించండి.

కర్కాటకం
అవసరాలకు సరిపడా ధనాన్ని సమకూర్చుకుంటారు. దూరప్రాంతాల్లో బంధువుల యోగక్షేమాలను తెలుసుకుంటారు. లేనివారికి బట్టలు దానం చేయండి. పరిమళ గంధాన్ని పూజలో ఉపయోగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి.

సింహ
వాస్తవికత ప్రామాణికంగా అడుగులు ముందుకు వేస్తారు. ఆహార, ఆరోగ్య నియమాల పట్ల దృష్టిని సారించడం మంచిది. లాభనష్టాలను బేరీజు వేసుకుని నిర్ణయాలను తీసుకుంటారు. త్రిశూల్ పొగ వేయడం వల్ల అన్ని విషయాలలో విజయప్రాప్తిస్తుంది.

కన్య
దేవాలయాలను సందర్శిస్తారు. ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తారు. శుభకార్యాల చర్చలను సాగిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. జువ్వాది పూజలలో ఉపయోగించండి.

తుల
దురలవాట్లకు స్వస్తి చెపుతారు. నిర్మాణాత్మక కార్యక్రమాలలో చురుకుదనాన్ని తీసుకువస్తారు. లౌక్యంగా వ్యవహరించి కార్యక్రమాలను సానుకూల పరచుకుంటారు.లక్ష్మీచందనంతో మీ ఇష్ట దైవానికి అభిషేకం చేయండి. ఆర్ధిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది.

వృశ్చికం
నూతన పంథాలో వినూత్న వ్యూహాలను అమలు పరుస్తారు. ఆత్మవిమర్శ చేసుకుంటారు. నిజాయితీగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిరహిస్తారు. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి.

ధనుస్సు
గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టిని సారిస్తారు. సులభంగా కావలసిన పనులకు కూడా ప్రయాస పడవలసి వస్తుంది. దీర్ఘాలోచనలు సాగిస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండడం ఉత్తమం. రోజూ అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. గోశాలలో గరిక దానం చేయండి.

మకరం
ఆర్థికాభివృద్ధిని సాధించడానికి మార్గాలను అన్వేషిస్తారు. క్షణం తీరిక లేకుండా గడుపుతారు. స్థిరాస్తి వ్యవహారాలలో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. శ్రమ అధికంగా ఉంటుంది. రోజూ గృహం, వ్యాపార సంస్థలో అష్టములికా గుగ్గిలంతో ధూపం వేయండి. శుభ ఫలితాలు పొందుతారు.

కుంభం
ప్రయాణాలలో మెళకువలు అవసరం. సంఘ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. ఏమాత్రం సంబంధం లేని విషయాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. సర్వరక్షా చూర్ణంతో రోజూ స్నానమాచరించాలి(తలస్నానం వద్దు).

మీనం
రహస్య సమాచారం వెలుగు చూస్తుంది. మీ అభిప్రాయాలలో రాజీ ధోరణి ఏర్పడుతుంది. కొనుగులు, అమ్మకాలు సాగిస్తారు. ప్రత్యర్థి వర్గం బలహీనంగా ఉండడం లాభిస్తుంది. సిద్ధగంధంతో మీ ఇష్ట దైవానికి అభిషేకం చేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.