యాప్నగరం

Mulugu Horoscope: ఆగస్టు 19 రాశి ఫలాలు - ఓ రాశి వారు ఆంజనేయుడికి ఆకుపూజ చేయాలి

ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్దాంతిగారి జ్యోతిషంపై చాలా మందికి నమ్మకం. ఆయన వెల్లడించిన విషయాలు అనేక సందర్భాల్లో నిజమయ్యాయి. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లోనూ ఆయన అంచనా వేసిన విధంగా ఫలితం వచ్చింది.

Samayam Telugu 20 Aug 2018, 7:01 am
మేషం :
Samayam Telugu raasi phalalu

వృత్తి-ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. సోదరసోదరీ వర్గానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. స్పెక్యులేషన్ వైపు మొగ్గ్గు చూపుతారు. ఇది లాభించే అంశం కాదు.

వృషభం :
వ్యాపారస్థులకు ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి. రహస్య చర్చలు, మంతనాలను సాగిస్తారు. ప్రముఖుల అండదండలతో అతి కీలకమైన వ్యవహారాలను చక్కబెడతారు.

మిథునం :
మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రాధాన్యత కలిగిన బాధ్యతలను నిర్వర్తిస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉంటారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు.

కర్కాటకం :
మిత్రులు లేదా బంధువులకు కొంత ధనాన్ని రుణంగా ఇస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిణమించే సూచనలున్నాయి. సొంతవర్గాన్ని బలోపేతం చేసుకునే చర్చలను ముమ్మరం చేస్తారు.

సింహం :
నిష్కారణమైన కలహాలను పరిష్కరించుకోవడానికి మౌనమే శరణ్యం. కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి.

కన్య :
ఆవేశం కన్నా ఆలోచనకు ప్రాధాన్యమినిస్తారు. ఎవరినీ నొప్పించకుండా జాగ్రత్తగా మసలుకుంటారు. రుణం ఇవ్వడం, తీసుకోవడం రెండూ కలిసిరావు. సకాలంలో చెల్లింపులను చేస్తారు.

తుల :
కష్టసాధ్యమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉంటారు. వ్యాపారస్థులకు అనుకూలం.

వృశ్చికం :
వాయిదా పడుతూ వస్తున్న కార్యక్రమాల్లో సానుకూలత కనిపించే సూచనలున్నాయి. ఆర్థిక ప్రగతి సాధించడం కోసం చేపట్టే చర్చల్లో స్వయం కృతాపరాధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించండి.

ధనుస్సు :
ప్రత్యర్థి వర్గంపై విజయం సాధిస్తారు. వీసా, పాస్‌పోర్ట్ వంటి అంశాలు కలిసి వస్తాయి. ఉన్నతస్థాయి వర్గం వారు కూడా మీ సలహాలను, సూచనలను పాటిస్తారు. స్వల్ప ధనలాభ సూచన. 11 మంగళవారాలపాటు ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయించండి.

మకరం :
వినూత్నంగా ఆలోచనలు సాగిస్తారు. స్థిరాస్తుల వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. చాలా విషయాలు మీ కనుసన్నలలో నడుస్తున్నట్లుగా భావిస్తారు. వాహన యోగ సూచన.

కుంభం :
మీలోని ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి. పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు. గౌరవ ప్రదమైన స్థానంలోని వారితో సత్సంబంధాలు మరింతగా బలపడతాయి. బహుమతులు అందుకుంటారు.

మీనం :
చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. దైవానుగ్రహం మీపై ఉన్నట్లుగా భావిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.