యాప్నగరం

Mulugu Horoscope: డిసెంబరు 22 రాశి ఫలాలు- మీన రాశివారికి శ్రమ ఫలిస్తుంది!

జ్యోతిషం, వాస్తు, ఖగోళ శాస్త్ర విషయాలను తెలియజేసే ములుగు సిద్ధాంతిగారి తెలుగువారికి సుపరిచితులు. రాజకీయ, సినీ ప్రముఖుల భవిష్యత్తు గురించి గతంలో ఆయన వెల్లడించిన అంశాలు నిజమయ్యాయి.

Samayam Telugu 22 Dec 2019, 7:04 am
జ్యోతిషం, వాస్తు, ఖగోళ శాస్త్ర విషయాలను తెలియజేసే ములుగు సిద్ధాంతిగారి తెలుగువారికి సుపరిచితులు. రాజకీయ, సినీ ప్రముఖుల భవిష్యత్తు గురించి గతంలో ఆయన వెల్లడించిన అంశాలు నిజమయ్యాయి.
Samayam Telugu mulugu daily rasi phalalu 22nd december 2019
Mulugu Horoscope: డిసెంబరు 22 రాశి ఫలాలు- మీన రాశివారికి శ్రమ ఫలిస్తుంది!



​మేష రాశి

మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి.

​వృషభ రాశి

మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. శ్రమకు తగిన ఫలితం అంతంతమాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

​మిథున రాశి

ఆర్ధిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. ధనలాభాలు పొందుతారు.

కర్కాటక రాశి

ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. నూతన ప్రయత్నాలు ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగుతాయి. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

​సింహ రాశి

ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. జీవితభాగస్వామి నుంచి ధనలాభాలు పొందుతారు. వాహనసౌఖ్యం పొందుతారు.

​కన్య రాశి

పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సంతానం నూతన ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధన, వస్తులాభాలు పొందుతారు.

​తుల రాశి

Read Also: డిసెంబరు 22 ఆదివారం.. తిథి బహుళ ఏకాదశి, నక్షత్రం

వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మెప్పు పొందుతారు. వస్తులాభాలు ఉంటాయి.

​వృశ్చిక రాశి

కొత్త మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందుతారు.

​ధనుస్సు రాశి

వివాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ప్రయాణాలలో తొందరపాటు తగదు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

​మకర రాశి

పాత బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన పనులలో సన్నిహితుల నుంచి సహాయసహకారాలు పొందుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

​కుంభ రాశి

దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలలో బంధువులు, స్నేహితులు కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.

​మీన రాశి

శ్రమ ఫలిస్తుంది. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారు సన్మానాలు, సత్కారాలు పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.