యాప్నగరం

Mulugu Horoscope: అక్టోబరు 24 రాశి ఫలాలు- ఓ రాశివారి శ్రమ ఫలిస్తుంది!

ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్దాంతిగారి జ్యోతిషంపై చాలా మందికి నమ్మకం. ఆయన వెల్లడించిన విషయాలు అనేక సందర్భాల్లో నిజమయ్యాయి. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లోనూ ఆయన అంచనా వేసిన విధంగా ఫలితం వచ్చింది.

Samayam Telugu 24 Oct 2018, 7:24 am

Mulugu Panchangam: అక్టోబరు 24 బుధవారం- పంచాంగం

మేషం
Samayam Telugu zodiacwheel

అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. షేర్లు, భూ క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

వృషభం
విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రయాణాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. గృహనిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.

మిథునం
రుణాలు తీరి ఊరట చెందుతారు. ఎంత శ్రమ పడ్డా ఫలితం కష్టమే. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నిదానంగా పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం
కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. షేర్లు, భూ క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

సింహం
భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పాతమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సంతానానికి నూతన ప్రయత్నాలు కలిసివస్తాయి.

కన్య
వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటుపోట్లు తొలగిపోతాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. సోదరుల నుంచి శుభ ఆహ్వానాలు అందుతాయి.

తుల
బంధువులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. సోదరుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

వృశ్చికం
శ్రమ ఫలిస్తుంది. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు
నూతన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. ధన, వస్తులాభాలు పొందుతారు. వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.

మకరం
ఋణ బాధల నుంచి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కుంభం
ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. షేర్లు, భూ క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం
కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానం సాంకేతికవిద్య అవకాశాలు పొందుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.