యాప్నగరం

Mulugu Horoscope: జులై 4 రాశి ఫలాలు- ఓ రాశివారికి వాహనయోగం!

శ్రీకాళహస్తి దేవస్థాన పండితుడిగానూ, ఖగోళ, వాస్తు శాస్త్రాల్లో నిష్ణాతుడిగానూ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారికి విశేష ఆదరణ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయన జ్యోతిషంపై అపారమైన నమ్మకం.

Samayam Telugu 4 Jul 2019, 7:42 am
మేషం
Samayam Telugu zodiacwheel

అనుకున్న పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో తొందరపాటు తగదు. స్వల్ప ధనలాభం ఉంది.

వృషభం
ఖర్చులు రాబడికి మించి ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి.

మిథునం
పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో చురుకుగా పాల్గొంటారు. శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహనయోగం ఉంది.

కర్కాటకం
ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

సింహ
శ్రమ తప్ప ఫలితం కనిపించదు. జీవితభాగస్వామి సలహాపై నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ధన, వస్తులాభాలు ఉన్నాయి.

కన్య
పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. బంధువుల నుంచి శుభ వార్తలు అందుకుంటారు.

తుల
సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. స్వల్ప ధనలాభం ఉంది.

వృశ్చికం

సంఘంలో ప్రేరుప్రఖ్యాతలు పొందుతారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి.

ధనుస్సు

బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. వృత్తి-వ్యాపారాలు విస్తరిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది.

మకరం

దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. జీవితభాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. విందువినోదాలలో చురుకుగా పాల్గొంటారు. కార్యజయం పొందుతారు.

కుంభం
దీర్ఘకాలిక ఋణాలు ఎదురై చికాకులు పెడతాయి. అధికంగా శ్రమిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తులాభం ఉంది.

మీనం
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భూములు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది.

Read Also: జులై 4 గురువారం -ములుగు పంచాంగం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.