అక్టోబరు 25 రాశి ఫలాలు- సాంకేతిక రంగంలో పనిచేసే వారికి సానూకూల ఫలితాలు
ఈ రోజు అంటే అక్టోబరు 25 సోమవారం నాడు ప్రారంభంలో చంద్రుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. అనంతరం బుధుడు పాలించే మిథునంలోకి ప్రవేశిస్తాడు. మిథున రాశిలో చంద్రుడు సంచారం కారణంగా సాంకేతిక రంగంలో పనిచేసే వ్యక్తులకు ఈ రోజు మంచి ఫలితాలను పొందుతారు.
మేషం..
ఈ రోజు మీ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. సోదరులతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రయాణాలు వేసుకోవచ్చు. వ్యాపారస్తులు పని విషయంలో తక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండాలి. అనవసర విషయాల్లో తలదూర్చుకుండా ఉంటే మంచిది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.
వృషభం..
ఈ రోజు మీ ప్రసంగంలో మృదుత్వం ఉంటుంది. ఈ కారణంగా మీరు కార్యాలయంలో సామాజిక స్థాయిలో మంచి ఫలితాలను పొందుతారు. పాత స్నేహితుడితో కలిసి సాయంత్రం చిరస్మరణీయమైందిగా నిరూపించవచ్చు. అనవసర ఖర్చులను చేయకండి. స్నేహితులతు మంచి సమయాన్ని గడుపుతారు. విందు, వినోద కార్యక్రమాలకు హాజరవుతారు.
మిథునం..
మీ రాశి నుంచి 12వ పాదంలో చంద్రుడు సంచారం కారణంగా మానసికంగా దృఢంగా ఉంటారు. సృజనాత్మకంగా పనిచేసేవారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. మీరు మీ ఖర్చులను నియత్రించుకోగలగాలి. విద్యారంగంలో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండాలి.
కర్కాటకం..
మీ రాశికి అధిపతి అయిన చంద్రుడు ఈ రోజు మీ 11 నుంచి 12వ పాదంలోకి వెళ్తాడు. కాబట్టి మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ రోజు ఎవరైనా రుణం అడిగితే చాలా ఆలోచించిన తర్వాత మాత్రమే డబ్బు ఇవ్వండి. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. అనవసర విషయాల్లో తలదూర్చుకుండా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు.
సింహం..
ఈ రోజు మీ రాశి వారికి చాలా మంచి రోజు అవుతుంది. చాలా మూలాల నుంచి డబ్బు పొందే అవకాశముంది. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే మీరు దాని నుంచి ప్రయోజనం అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుబంధం ఉన్నవారు తమ పని రంగంలో మంచి మార్పులను చూస్తారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరకు పూర్తి చేస్తారు.
కన్య..
ఈ రోజు మీ తండ్రితో సంబంధం మెరుగుపడుతుంది. కుటుంబ వ్యాపారం చేసే వారు నేడు మంచి ఒప్పందాన్ని పొందవచ్చు. ఈ కారణంగా కుటుంబంలో సానుకూల చర్చలు కొనసాగవచ్చు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరకు వాటిలో విజయాన్ని అందుకుంటారు. కుటుంబ వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.
తుల..
చంద్రుడు మీ రాశి నుంచి 8వ పాదంలో ఉన్నాడు. ఈ కారణంగా ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ రాశి వ్యక్తులు ఉపాధ్యాయుల సహకారం పొందుతారు. విద్యా రంగంలో మీ విజయానికి దారితీస్తుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసుకుంటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు అందుకుంటారు.
వృశ్చికం..
ఈ రోజు ప్రారంభంలో చంద్రుడు మీ రాశి నుంచి ఎనిమిదవ పాదంలో ఉంటాడు. కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా ఆకస్మిక ద్రవ్య లాభాలను అందుకుంటారు. కొంతమందికి విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. అయితే మీ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాల్లో తలదూర్చుకుండా ఉంటే మంచిది.
ధనస్సు..
ధనస్సు రాశి వ్యక్తులు ఈ రోజు వైవాహిక జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్ క్షణాలు అనుభవించవచ్చు. ఇంకా వివాహం కాని వ్యక్తులు మంచి వివాహ ప్రతిపాదనను చేస్తారు. వివాహితులకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీకు అండగా నిలుస్తారు.
మకరం..
ఈ రోజు మకర రాశి వారికి భవిష్యత్తు గురించి ఆందోళనలు ఉంటాయి. మీరు వేటి గురించి చింతించకుండా వ్యవహరించమని భవిష్యత్తు గురించి కచ్చితంగా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు సాయంత్రం మానసిక ప్రశాంతతను పొందుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండాలి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలను సమయానికి పూర్తి చేసుకుంటారు.
కుంభం..
కుంభ రాశి వారు ఈ రోజు తల్లి వైపు నుంచి కొన్ని శుభవార్తలను పొందుతారు. అలాగే మీ రాశి విద్యార్థులు విద్యారంగంలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజు శత్రువు వైపు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు మంచి ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి.
మీనం..
ఈ రోజు మీ రాశి నుంచి నాలుగో పాదంలో చంద్రుడు ఉంటాడు. ఇది మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపడానికి అవకాశం ఇస్తుంది. గతం నుంచి తల్లి ఆరోగ్యం చెడిపోతుంటే ఈ రోజు ఆమెలో సానుకూల మార్పులు రావచ్చు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది.