యాప్నగరం

Birthday 16 August 2022 నేడు పుట్టినవారికి వచ్చే ఏడాది వరకు ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...

Birthday 16 August 2022 మంగళవారం రోజున బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్, డేవిడ్ ధావన్ బర్త్ డే. వీరితో పాటు ఈరోజు బర్త్ డే జరుపుకునేవారందరికీ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో రాబోయే ఏడాదిలో ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకోండి.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 16 Aug 2022, 12:19 am
Birthday 16 August 2022 హిందూ పంచాంగం ప్రకారం అయినా, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయినా ప్రతిరోజూ ఎవరో ఒకరి పుట్టినరోజు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే కొందరు సెలబ్రిటీల పుట్టినరోజునే మీ పుట్టినరోజు రావడం కూడా విశేషం. ఈ నేపథ్యంలో మంగళవారం రోజున బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్, డేవిడ్ ధావన్ బర్త్ డే. వీరితో పాటు ఈరోజు బర్త్ డే జరుపుకునేవారందరికీ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు.
Samayam Telugu Birthday Horoscope August 16

ఈ సందర్భంగా ఈరోజు పుట్టిన వారందరికీ రాబోయే ఏడాదిలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. వ్యాపారులకు ఆర్థిక పరమైన లాభాలొస్తాయా? నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయా? విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారా లేదా అనే విషయాలతో పాటు ఇంకా అనేక వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వర్షకుండలి గణన ప్రకారం, ఈ ఏడాది మీకు బుధుడు, సూర్యుడు అధిపతులుగా ఉంటారు. ఆగస్టు చివరి నాటికి ఉద్యోగులకు సహోద్యోగులతో ఆఫీసులో సానుకూలత ఏర్పడుతుంది. సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో మీరు చెల్లాచెదురైన శక్తిని పునరుద్ధరించడంలో నిమగ్నమై ఉంటారు.

Weekly Horoscope ఈ వారం కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి...!
నవంబర్, డిసెంబర్ నెలలో కొన్ని మంచి పనులు చేయడం వల్ల ఆనందంగా గడుపుతారు. 2023 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నాటికి మీకు పనికి సంబంధించి కొత్త అవకాశాలు తెరవబడతాయి. మార్చిలో మీ వ్యాపార పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ఏప్రిల్ నెలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

మే నెలలో మీరు కుటుంబ బాధ్యతలు పూర్తి చేస్తారు. విద్యార్థులకు విద్యపై ప్రత్యేక ఆసక్తి పెరుగుతుంది. మీరు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్నొ పొందుతారు. జూన్ నుంచి జూలై నెలాఖరులోపు పనులకు సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మహిలలకు ఈ కాలంలో ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది.

- ఆచార్య కృష్ణ దత్త శర్మ
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.