యాప్నగరం

Birthday 22 September 2022 ఈరోజు పుట్టిన వారికి వచ్చే ఏడాది వరకు ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...!

Birthday 22 September 2022 గురువారం రోజున బాలీవుడ్ నటి సనా సయీద్, బుల్లి తెర నటి రిద్ధి డోగ్రా పుట్టినరోజు. వీరితో పాటు ఈరోజు బర్త్ డే జరుపుకునేవారందరికీ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో రాబోయే ఏడాదిలో ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకోండి.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 22 Sep 2022, 12:18 am
Birthday 22 September 2022 హిందూ పంచాంగం ప్రకారం అయినా, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయినా ప్రతిరోజూ ఎవరో ఒకరి పుట్టినరోజు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే కొందరు సెలబ్రిటీల పుట్టినరోజునే మీ పుట్టినరోజు రావడం కూడా విశేషం. ఈ నేపథ్యంలో గురువారం రోజున బాలీవుడ్ నటి సనా సయీద్, బుల్లి తెర నటి రిద్ధి డోగ్రా పుట్టినరోజు. వీరితో పాటు ఈరోజు బర్త్ డే జరుపుకునేవారందరికీ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈరోజు పుట్టిన వారందరికీ రాబోయే ఏడాదిలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. వ్యాపారులకు ఆర్థిక పరమైన లాభాలొస్తాయా? నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయా? విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారా లేదా అనే విషయాలతో పాటు ఇంకా అనేక వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Birthday Horoscope


ఈ ఏడాది మీకు సూర్యుడు, అంగారకుడు(కుజుడు) అధిపతులుగా ఉంటారు. శని, కుజుడు, బుధ గ్రహాలు కలిసి త్రిగ్రాహి యోగం ఏర్పరచడం వల్ల మీకు సెప్టెంబర్ మాసంలో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కొంత నష్టపోవాల్సి ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలఖారు వరకు మీరు కొన్ని రాజకీయ పరమైన వివాదాలకు తెరదించుతారు. డిసెంబర్, వచ్చే ఏడాది జనవరి 2023 మధ్య అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి.

Venus Transit in Virgo కన్యరాశిలోకి శుక్రుడి ఎంట్రీతో.. ఏ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందంటే...!

ఫిబ్రవరి, మార్చి నెలలో వ్యాపారులకు వ్యాపారానికి సంబంధించి కొన్ని సవాళ్లు ఎదురువొచ్చు. ఏప్రిల్, మే నుండి కొన్ని కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జూన్ నుండి జూలై నెలలో స్నేహితుల సహాయంతో పనుల్లో ఉండే ఇబ్బందులను అధిగమిస్తారు. ఆగస్టు నెలలో కొన్ని పర్యాటక యాత్రలను చేస్తారు. సెప్టెంబర్ చివరి నాటికి కొత్త పని కోసం కొన్ని ప్రణాళికలు రూపొందించుకుంటారు.

మహిళలకు ఈ ఏడాదిలో జీవన ప్రమాణం మెరుగవుతంది. మీ కుటుంబ సభ్యుల ఆదాయ వనరులు పెరుగుతాయి. త్రిగ్రాహి యోగం శాంతి కోసం మీరు సంజీవని మంత్రాలను జపించాలి. ఆదివారం రోజున రావి చెట్టు కింద నాలుగు చతురస్రాకార ఆకులను ఉంచి పూజ చేయాలి.

- ఆచార్య కృష్ణ దత్త శర్మ

Read Latest Astrology News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.