యాప్నగరం

Birthday 26 September 2022 ఈరోజు పుట్టిన వారికి వచ్చే ఏడాది వరకు ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...!

Birthday 26 September 2022 సోమవారం రోజున నటి అర్చనా పురన్ సింగ్, నటుడు చుంకీ పాండే సింగ్ తో పాటు ఈరోజు బర్త్ డే జరుపుకునేవారందరికీ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో రాబోయే ఏడాదిలో ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకోండి.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 26 Sep 2022, 12:33 am
Birthday 26 September 2022 హిందూ పంచాంగం ప్రకారం అయినా, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయినా ప్రతిరోజూ ఎవరో ఒకరి పుట్టినరోజు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే కొందరు సెలబ్రిటీల పుట్టినరోజునే మీ పుట్టినరోజు రావడం కూడా విశేషం. ఈ నేపథ్యంలో సోమవారం రోజున నటి అర్చనా పురన్ సింగ్, నటుడు చుంకీ పాండే సింగ్ తో పాటు ఈరోజు బర్త్ డే జరుపుకునేవారందరికీ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈరోజు పుట్టిన వారందరికీ రాబోయే ఏడాదిలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. వ్యాపారులకు ఆర్థిక పరమైన లాభాలొస్తాయా? నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయా? విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారా లేదా అనే విషయాలతో పాటు ఇంకా అనేక వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Birthday Horoscope


వర్ష కుండలి గణన ప్రకారం, ఈ ఏడాది మీకు బుధుడు అధిపతిగా ఉంటాడు. దీంతో సెప్టెంబర్ ప్రారంభం నుండి అక్టోబర్ నెల వరకు మీరు ఎలాంటి పాత వివాదాలనైనా సులభంగా పరిష్కరించుకోవడంలో విజయం సాధిస్తారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో కొందరు గొప్ప వ్యక్తులను కలవడం వల్ల ఆనందంగా ఫీలవుతారు. వచ్చే ఏడాది 2023లో జనవరి, ఫిబ్రవరి నెలలో ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతుతో పురోగతి లభిస్తుంది. ఆస్తి సంబంధిత వివాదాలు మార్చిలో పరిష్కారమవుతాయి.

Mahalaya Amavasya 2022 మహాలయ అమావాస్య వేళ 4 గ్రహాల అరుదైన కలయిక.. ఈ 5 రాశులకు మహార్దశ.. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!

ఏప్రిల్ మాసంలో రాజకీయ ప్రత్యర్థుల పట్ల వ్యతిరేకత తీవ్ర స్థాయికి మారొచ్చు. మీ మనసులో రహస్యాలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోకండి. మే నుండి జూన్ వరకు ఏదైనా శుభకార్యాలను ప్లాన్ చేస్తారు. జూలై నెలలో అర్థవంతమైన ప్రయాణాలు, పర్యాటకం చేసే అవకాశాలు ఉన్నాయి.

మహిళలకు ఈ ఏడాది వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు తక్కువ శ్రమతోనే మంచి విజయాలను సాధిస్తారు. ఉత్తమ ఫలితాల కోసం ఆగస్టు మాసంలో శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. వీలైనన్ని రోజులు ఎద్దుకు బెల్లం తినిపించాలి.

- ఆచార్య కృష్ణ దత్త శర్మ

Read Latest Astrology News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.