యాప్నగరం

మకర రాశి జాతకం అద్భుతంగా ఉంటుంది

జన్మ రాశులను పుట్టిన తేది, నక్షత్రం ప్రకారం నిర్ణయిస్తారు. వీటి సాయంతో వ్యక్తుల భవిష్యత్తు, వర్తమానం గురించి జ్యోతిషులు తెలియజేస్తారు.

TNN 14 Jun 2017, 7:53 am
మేషం
Samayam Telugu daily telugu horoscope june 14 2017 daily astrology prediction in telugu
మకర రాశి జాతకం అద్భుతంగా ఉంటుంది

పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులను, కార్యాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. కళలు, క్రీడలపై ఆసక్తి పెంచుకుంటారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. మార్కెటింగ్, రిప్రజెంటేటివ్‌లకు మంచి అవకాశాలు లభిస్తాయి.

వృషభం
రహస్య శత్రువులు తప్పుడు ప్రచారాలు చేసే ఆస్కారం ఉంది. ఆఫీసు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తే ఆస్కారం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహనాలోపం ఏర్పడుతుంది. కొబ్బరి, మామిడి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

మిథునం
మీ బలహీనతల్ని జీవిత భాగస్వామి సాయంతో దూరం చేసుకుంటారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు కొత్త వ్యక్తులతో అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరం. సొంతంగా గృహం ఏర్పరుచుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి అచ్చు తప్పులు వల్ల మాటపడాల్సి వస్తుంది.

కర్కాటకం
పెట్టుబడుల విషయంలో తెలివిగా వ్యవహరించండి. ఉమ్మడి వ్యాపారాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మహిళలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సేల్స్ సిబ్బందితో లౌక్యంగా వ్యవహరించాలి. బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలు విషయంలో లౌక్యంగా వ్యవహరించకపోతే చికాకులు తప్పవు.

సింహం
ఆరోగ్య సమస్యలు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. చేతి వృత్తుల వారు, ఏజెంట్లు ఎంతగా శ్రమించినా ఆదాయం మాత్రం స్వల్పంగా ఉంటుంది. ప్రేమికులకు ఎడబాటు, ఊహించని చికాకులు ఎదురవుతాయి. నిరుద్యోగులు నిరుత్సాహాన్ని వీడి శ్రమిస్తే ఫలితాలొస్తాయి. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరప్రయాణాల్లో చికాకులు, ఇబ్బందులు లాంటివి తప్పవు.

కన్య
పెట్టుబడులతో లాభాలను ఆర్జిస్తారు. ఎదుటి వారి నుంచి గౌరవ మర్యాదలను పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. మొండి బాకీలు వసూలు కావడంతో ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. విద్యుత్, మెకానికల్ రంగాల వారికి సంతృప్తికరంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలతో పనిభారం తప్పదు.

తుల
సహోద్యోగులు కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటారు. అవాస్తవికమైన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. ఆలయాలకు, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగావారు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. ఫీజులు, పన్నులు, రుణవాయిదాలు సకాలంలో చెల్లిస్తారు.

వృశ్చికం
భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. స్నేహితులు కష్ట సమయంలో అండగా ఉంటారు.ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మహిళల ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. శారీరక ఆరోగ్యం సహకరిస్తుంది. నిరుద్యోలకు రాత, మౌఖిక పరీక్షల్లో మెలకువ అవసరం. రాజకీయ నాయకులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రక్త సంబంధీకుల అన్యోన్యత పెరుగుతుంది.

ధనస్సు
ఆర్థిక పరిస్థితి ఆశించనంతగా ఉండదు. ప్రేమికుల మధ్య వివాదాలు తలెత్తే ఆస్కారం ఉంది. కాంట్రాక్టర్లు బిల్లుల విషయంలో కొంత జాప్యం ఎదురైనా పూర్తిగా అందుతాయి. మహిళల తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు. పాత వస్తువులను కొనుగోలు చేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి.

మకరం
ఆరోగ్యం సహకరిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాలు, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. అవసరాలకు కావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి అనుభవం గడిస్తారు. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడి, యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు.

కుంభం
ఇతరుల కోసం ఖర్చు చేసే స్వభావానికి స్వస్తి చెప్పండి. ఆదాయానికి తగట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. పాత మిత్రులతో బంధం మరింత బలపడతుంది. కుటుంబ సభ్యుల అభిప్రాయాలతో ఏకీభవించలేరు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చిన్నారులకు అవసరమైన వస్తువులను సేకరిస్తారు. ప్రముఖులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.

మీనం
కొత్త ప్రాజెక్ట్‌ల నిబద్ధత గురించి అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు సాగాలి. కళలు, ఫోటోగ్రఫీ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య, విదేశ వ్యవహారాలు సక్రమంగా సాగుతాయి. బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ పెట్టండి. కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.