Mulugu Subhathidi Telugu Panchangam For 12th April 2019
Mulugu Panchangam: ఏప్రిల్ 12 శుక్రవారం -నేటి తిథి, నక్షత్రం
పంచాంగం కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం మాత్రం రెండు విధానాలే అమల్లో ఉన్నాయి. అవి సూర్యమానం', చంద్రమానం'.
Samayam Telugu13 Apr 2019, 7:26 am
శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే భారతీయులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం. ఇది దుర్ముహూర్తాలు, శుభముహూర్తాలు, వర్జ్యాలు, రాహుకాలం, సూర్యోదయం లాంటి విషయాల గురించి తెలియజేస్తుంది. పంచాంగం కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం మాత్రం రెండు విధానాలే అమల్లో ఉన్నాయి. అవి సూర్యమానం', చంద్రమానం'. చంద్రుని సంచరణతో అనుసంధానమైంది చాంద్రమాన పంచాగం, సూర్యుని సంచరణతో అనుసంధానమైంది సూర్యమాన పంచాంగం. తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. కాబట్టి చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది ఛైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తవుతుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ జ్యోతిషశ్శాస్త్ర నిపుణులు పంచాంగాలు మార్కెట్లో లభించినా, ములుగు సిద్ధాంతిగారి పంచాంగానికి ఓ ప్రత్యేకత ఉంది. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారి పంచాంగంలో తిథి, వార, వర్జ్యాలు, శుభమూహూర్త, దుర్ముహూర్తాల గురించి సరైన సమాచారం ఉంటుంది. గ్రెగేరియన్ క్యాలెండర్తోపాటు చంద్రమానం అనుసరించి రోజువారీ, నెలవారీ, వార్షిక పంచాంగాన్ని రూపొందిస్తారు. ములుగు వారి ఏప్రిల్ 12 శుక్రవారం పంచాంగం.
తేదీ
వారం
సూర్యోదయం-సూర్యాస్తమయం
ఏప్రిల్ 12
శుక్రవారం
ఉదయం 5.50-సాయంత్రం 6.10
సంవత్సరం
కాలం
రుతువు
మాసం-పక్షం
యోగం-కరణం
తిథి
శ్రీవికారినామ
ఉత్తరాయణం-వేసవికాలం
వసంతరుతువు
ఛైత్రం-శుక్లపక్షం
అతిగండo ఉదయం 11.17 వరకు తదుపరి సుకర్మ- వణిజఉదయం 10.42 వరకు తదుపరి భద్ర/విష్ఠి రాత్రి 9.42 ఆ తదుపరి బవ
సప్తమి మధాహ్నం 1.23 వరకు తదుపరి అష్టమి
నక్షత్రం
వర్జ్యం
దుర్ముహూర్తం
రాహుకాలం
అమృత ఘడియలు
శుభసమయం
ఆరుద్ర తదుపరి పునర్వసు
రాత్రి 9.26 నుంచి 10.58 వరకు
ఉదయం 8.24 నుంచి 9.14, మధ్యాహ్నం 12.44 నుంచి 1.23 వరకు
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.