యాప్నగరం

Daily Panchangam: సెప్టెంబరు 30 బుధవారం.. తిథి చతుర్దశి, పూర్వాభాద్ర నక్షత్రం

జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారం, శరీరక లక్షణాలు, అర చేతులు మొదలైన వివిధ అంశాలను ఆధారం చేసుకొని జ్యోతిషం వివరిస్తుంది. ఆరు వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి.

Samayam Telugu 30 Sep 2020, 6:32 am
శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే భారతీయులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం. ఇది దుర్ముహూర్తాలు, శుభముహూర్తాలు, వర్జ్యాలు, రాహుకాలం, సూర్యోదయం లాంటి విషయాల గురించి తెలియజేస్తుంది. పంచాంగం కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం మాత్రం రెండు విధానాలే అమల్లో ఉన్నాయి. అవి సూర్యమానం', చంద్రమానం'.
Samayam Telugu mulugu subhathidi telugu panchangam for 30 september 2020
Daily Panchangam: సెప్టెంబరు 30 బుధవారం.. తిథి చతుర్దశి, పూర్వాభాద్ర నక్షత్రం


Also Read: Daily Horoscope: సెప్టెంబరు 30 రాశి ఫలాలు- వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు

చంద్రుని సంచరణతో అనుసంధానమైంది చాంద్రమాన పంచాగం, సూర్యుని సంచరణతో అనుసంధానమైంది సూర్యమాన పంచాంగం. తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. కాబట్టి చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది ఛైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తవుతుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ జ్యోతిషశ్శాస్త్ర నిపుణులు పంచాంగాలు మార్కెట్‌లో లభించినా, ములుగు సిద్ధాంతిగారి పంచాంగానికి ఓ ప్రత్యేకత ఉంది. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారి పంచాంగంలో తిథి, వార, వర్జ్యాలు, శుభమూహూర్త, దుర్ముహూర్తాల గురించి సరైన సమాచారం ఉంటుంది. గ్రెగేరియన్ క్యాలెండర్‌తోపాటు చంద్రమానం అనుసరించి రోజువారీ, నెలవారీ, వార్షిక పంచాంగాన్ని రూపొందిస్తారు. ములుగు వారి సెప్టెంబరు 30 బుధవారం పంచాంగం.
తేదీవారంసూర్యోదయం-సూర్యాస్తమయం
సెప్టెంబరు 30సౌమ్యవాసరేఉదయం 05.57- సాయంత్రం 05.58

సంవత్సరంకాలంరుతువుమాసం-పక్షంతిథి
శ్రీశార్వారి నామా సంవత్సరందక్షిణాయణం-వర్షాకాలం శరదృతువుఆశ్వయుజ మాసం శుక్ల పక్షం చతుర్దశి రాత్రి 12.26

నక్షత్రంవర్జ్యందుర్మూహుర్తంరాహుకాలంశుభసమయం
పూర్వాభాద్ర రాత్రి 03.15ఉదయం 07.51- 09.37 ఉదయం 11.33-12.21 వరకు మధ్యాహ్నం 12.09-01.39 వరకుఉదయం 06.15 నుంచి 06.55 వరకు తిరిగి సాయంత్రం 06.22 నుంచి 07.07 వరకు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.