యాప్నగరం

ఈ నెల 30న ఏడాది చివరి చంద్రగ్రహణం.. రాశులపై ప్రభావం

నవంబరు 30న సోమవారం నాడు ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం మొత్తం వ్యవధి 04 గంటల 21 నిమిషాల పాటు ఉంటుంది. ఈ గ్రహణం పూర్తిగా ఉండదు కానీ ఉపఛాయ చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ నేపథ్యంలో చివరి చంద్రగ్రహణ వల్ల మేషం నుంచి మీనం వరకు 12 రాశుల రాశిఫలాలేంటో ఇప్పుడు చూద్దాం.

Samayam Telugu 28 Nov 2020, 8:27 pm
కార్తిక మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున చంద్రగ్రహణ జరగబోతుంది. అంటే నవంబరు 30న సోమవారం నాడు ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం మొత్తం వ్యవధి 04 గంటల 21 నిమిషాల పాటు ఉంటుంది. ఈ గ్రహణం పూర్తిగా ఉండదు కానీ ఉపఛాయ చంద్రగ్రహణం సంభవించనుంది. ఇది ఓ ఖగోళ దృగ్విషయం దీని వెనక శాస్త్రీయ అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆధ్యాత్మిక విశ్వాసాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో గ్రహణం ప్రభావం రాశులపై కనిపిస్తుంది. కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆర్థిక స్థితులు బలంగా ఉండవచ్చు. మరికొన్ని రాశుల జీవితాల్లో గందరగోళ పరిస్థితులు ఉండవచ్చు. ఈ నేపథ్యంలో చివరి చంద్రగ్రహణ వల్ల మేషం నుంచి మీనం వరకు 12 రాశుల రాశిఫలాలేంటో ఇప్పుడు చూద్దాం.
Samayam Telugu lunar eclipse 2020 know what will be effects of moon on all zodiac signs
ఈ నెల 30న ఏడాది చివరి చంద్రగ్రహణం.. రాశులపై ప్రభావం



​మేషం..

నవంబరు 30న చంద్రగ్రహణం మీ రాశి నుంచి రెండో పాదంలో వృషభంలో ఉంటుంది. ఇది మీ మనస్సును మారస్తుంది. కోపంతో మాట్లాడే మాటలపై సంయమనం పాటించండి. అందరికంటే ఎక్కువగా వాదించకండి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదే సమయంలో మీరు ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి నూతన ఆలోచనతో పనిచేస్తారు. మీ ఆరోగ్యం పట్ల పాక్షిక ఆందోళన ఉంటుంది. రాబోయే సంవత్సరంలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

​వృషభం..

చంద్రగ్రహణం.. మీ వృషభంలోకి సంచరించనుంది. ఇది మీ రాశి చక్రంపై ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీ కుటుంబాన్ని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎలాంటి ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండండి. అంతేకాకుండా అప్రమత్తంగా ఉండండి. మీకిష్టమైన వారితో కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు మీ ఘర్షణలను నివారించండి. ఏదైనా నూతన పనిచేస్తే అందులో మీకు విజయం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలంగా ఉంచడానికి కృషి చేస్తూ ఉండండి. ఫలితంగా మీకు ప్రయోజనం ఉంటుంది.

​మిథునం..

కార్తిక పౌర్ణమి రోజు సంభవించే ఈ చంద్రగ్రహణం మీ రాశి నుంచి 12వ పాదంలో సంచరించనున్నాడు. ఫలితంగా ఈ సారి మీకు అధిక వ్యయం ఉంటుంది. ఈ కారణంగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. మీ ప్రాజెక్టుకు పూర్తి చేయడానికి మీరు ఒకరి నుంచి రుణం తీసుకోవచ్చు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచడానికి పనిచేయండి. ఎవ్వరితోనూ ఇబ్బంది పడకండి. రహస్య శత్రువులు మిమ్మల్ని బాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు కుటుంబాన్ని సంప్రదించండి.

​కర్కాటకం..

మీ రాశిచక్రం నుంచి 11వ పాదంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ సమయంలో మీ విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ మీరు విజయం సాధిస్తారు. తోబుట్టువులతో మంచి సమయాన్ని గడపండి. ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. మీరు ఎంచుకున్న రంగంలో నూతన ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటారు. ఇది ఖర్చును కూడా పెంచుతుంది.

​​సింహం..

మీ రాశిచక్రం నుంచి 10వ పాదంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు ఉత్సాహంగా ఉంటారు. వ్యాపార రంగంలో వృద్ధిని అందుకుంటారు. వ్యాపార అభివృద్ధికి నూతన ఆలోచనలు వ్యూహాలపై పని చేయండి. ఇది సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. తండ్రితో సంబంధాలు గరం గరంగా ఉంటాయి. నిర్మాణాత్మక పని చేయడానికి మనస్సు కుదుటపడుతుంది. అయితే రాబోయే రోజుల్లో ఖర్చు పెరుగుదలను మీరు అనుభవించవచ్చు.

​కన్య..

మీ రాశిచక్రం నుంచి 9వ పాదంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ సమయంలో ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిస్తారు. దీని వల్ల మనస్సు ఆధ్యాత్మిక పనుల్లో నిమగ్నమై ఉంటుంది. శుభకరమైన ప్రదేశాలకు ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో చేసిన పెట్టుబడులు మీ ఆర్థిక స్థితిని బలపరుస్తాయి. కుటుంబ వ్యాపారాన్ని పెంచడానికి తోబుట్టువులతో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తారు. విదేశాలకు వెళ్లే ప్రజల కోరిక నెరవేరుతుంది. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. ఇది మీ మనస్సును మెప్పిస్తుంది.

​తుల..

మీ రాశిచక్రం నుంచి 8వ స్థానంలో చంద్రగ్రహణం ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీరు చాలా సవాళ్లను ఎదుర్కోనవచ్చు. పెరిగిన ఖర్చుల వల్ల ఆర్థిక సమతూల్యత మరింత దిగజారుతుంది. అందువల్ల వాటిని జాగ్రత్తగా పారవేయడం మంచిది. అత్తమామలు ఉద్రిక్తతకు కారణమవుతారు. కుటుంబంలో అసహ్యకరమైన వాతావరణం ఉండవచ్చు. అది మీ సౌకర్యాన్ని పెంచుతుంది. మీరు కెరీర్లో సానుకూలతను తీసుకొస్తుంది.

​వృశ్చికం..

ఈ రోజు మీరు రాశిచక్రం నుంచి ఏడో పాదంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ సమయంలో నూతన ఎత్తుపల్లాలను చూస్తారు. వ్యాపారంలో మీరు భాగస్వామితో మంచి సహకారం పొందుతారు. మీరు ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. సామర్థ్యం కారణంగా మీరు ఆదాయంలో పెరుగుదల చూస్తారు. తల్లి నుంచి దూరంగా ఉంటారు.

​ధనస్సు..

ఈ రోజు మీ రాశిచక్రం నుంచి ఆరో పాదంలో ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో ఉద్యోగుల పూర్తి మద్దతు ఉంటుంది. ఈ చిన్న ప్రయాణం కూడా ఏర్పడుతుంది. మీరు ప్రారంభంలో మరింత కష్టపడాల్సి వచ్చినప్పటికీ తర్వాత విజయానికి తలుపులు తెరుచుకుంటాయి. ఈ సమయం మీకు అనేక విషయాలు గురించి నూతన జ్ఞానాన్ని ఇస్తుంది. రాబోయే రోజుల్లో మీరు ప్రయోజనం పొందుతారు. సంబంధంలో ఎలాంటి చర్చ జరగకుండా ఉండండి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు.

​మకరం..

మీ రాశిచక్రం నుంచి ఐదో స్థానంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు ఆహ్లాదకరమైన సమయం ఉంటుంది. వృత్తిపరంగా ముందుకు సాగండి. ఇది మీ ప్రభావాన్ని పెంచడానికి సహాయపడుతుంది. మీ పనులు చాలా పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. మీ తోబుట్టువులతో ప్రవర్తన సానుకూలంగా ఉంటుంది. విద్యార్థుల కోసం ఈ సమయం పరీక్షలతో నిండి ఉంటుంది. కానీ చివరకు విజయవంతమవుతుంది.

​కుంభం..

మీ రాశిచక్రం నుంచి నాల్గవ పాదంలో చంద్రగ్రహణం ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో తల్లి ఆరోగ్యం ఒత్తిడి నుంచి విముక్తి పొందుతుంది. మీరు వారికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. ఇంటి పునరుద్ధరణ గురించి ఆలోచిస్తారు. ఆస్తి సంబంధిత వివాదాలు కూడా ఈ సమయంలో పరిష్కరించుకుంటారు. కార్యాలయంలో సమస్యలను నివారించడానికి మీకు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పని కోసం నూతన మార్గాలను తెరుచుకుంటారు.

​మీనం..

మీ రాశిచక్రం నుంచి మూడో స్థానంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు ఈ రంగంలో నూతన బాధ్యతలను పొందుతారు. మీ కలలను నెరవేర్చడానికి మీకు సమయం కూడా లభిస్తుంది. పొరుగువారు, తోబుట్టువులతో ఒత్తిడి పరిస్థితులు సాధారణంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యకలపాల్లో పాల్గొనడం మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటారు. ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. మీరు ముఖ్యమైన ప్రాజెక్టుల్లో కూడా పని ప్రారంభించవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.