యాప్నగరం

వచ్చే నెలలో తులా రాశిలో బుధుడు ఆగమనం.. ఈ రాశులకు ప్రయోజనం..!

పరిగణిస్తారు. నవంబరు 03న బుధుడు.. తులా రాశిలో ఆగమనం చెందనున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి కెరీర్ లో పురోగతి లభిస్తుంది. ఇదే సమయంలో ఆర్థికంగా ప్రయోజనం అందుకుంటారు. ఈ నేపథ్యంలో బుధుడు రవాణా ఏయే రాశులకు అనుకూలంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Samayam Telugu 29 Oct 2020, 6:56 am
బుధుడిని నవగ్రహాలకు యువరాజుగా పరిగణిస్తారు. తాజాగా బుధుడు.. శుక్రుడు రాశి అయిన తులా రాశిలో సరళమార్గంలో ప్రయాణించనున్నాడు. బుధుడి ప్రత్యక్ష కదలిక వల్ల రాశిచక్రాలకు శుభంగా పరిగణిస్తారు. నవంబరు 03న బుధుడు.. తులా రాశిలో ఆగమనం చెందనున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి కెరీర్ లో పురోగతి లభిస్తుంది. ఇదే సమయంలో ఆర్థికంగా ప్రయోజనం అందుకుంటారు. సహజంగా బుధుడు ఆకుపచ్చ వస్తువులపై అధికంగా ప్రభావం చూపుతాడు. అంటే పంట దిగుబడిని బుధుడు బాగా పెంచుతాడు. బుధుడి స్థానచలనం రాశులకు చాలా ప్రత్యేకమైందిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో బుధుడు రవాణా ఏయే రాశులకు అనుకూలంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Samayam Telugu mercury will direct transits in libra will give benefit to these 6 zodiac sign
వచ్చే నెలలో తులా రాశిలో బుధుడు ఆగమనం.. ఈ రాశులకు ప్రయోజనం..!



​వృషభం..

బుధుడు.. వృషభ రాశిలోని ఆరో పాదంలో ప్రయాణించనున్నాడు. ఫలితంగా ఇంట్లో అనారోగ్య, అప్పుల సమస్యలు బాధిస్తాయి. అంతేకాకుండా బుధుడి ఆగమనం వల్ల ఎప్పుడు తీసుకున్న రుణాన్ని ఇప్పుడు చెల్లించగలుగుతారు. అంతేకాకుండా మీ శత్రువులు కూడా దాని ప్రభావాల నుంచి విఫలమవుతారు. చాలాకాలంగా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు బుధుడు నుంచి ప్రయోజనం లభిస్తుంది. ఎలాంటి రుణం కోసం చూడకుండా ఉంటే విజయాన్ని సాధించవచ్చు. ఈ సమయంలో క్షీణించిన కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. పోటీల్లో సంతానం విజయవంతమవుతుంది.

​కర్కాటకం..

బుధుడు.. కర్కాటక రాశిలో నాలుగో పాదంలో ఉండనున్నాడు. నాలుగోపాదం.. తల్లి, వాహనంస మానసిక సమతూల్యతతో పాటు ఇతర ఆనందాలను సూచిస్తుంది. బుధుడు స్థానచలనం వల్ల మీరు అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ వ్యాపారం పుంజుకుంటుంది. మీరు ప్రాజెక్టులో ఎక్కువ సేపు పనిచేయడం గురించి ఆలోచిస్తుంటే ప్రస్తుత ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు.

​కన్య..

కన్యా రాశిలో ఆరో పాదంలో ప్రవేశించనున్నాడు అంగారకుడు. ఆరో పాదం సంపద భావనగా పరిగణిస్తారు. బుధుడి స్థానచలనం డబ్బు విషయంలో అద్భుత విజయాన్ని ఇవ్వబోతుంది. మీరు ఈ మాధ్యమం ద్వారా డబ్బు పొందుతారు. ఈ సమయంలో పెండింగులో ఉన్న చెల్లింపులను పూర్తి చేస్తారు. తెలియని మార్గాల నుంచి డబ్బు వస్తుంది. నూతన ఉద్యోగ మార్గాలను తయారు చేసుకోవచ్చు. ఈ సమయంలో వ్యాపారం నుంచి ఉత్తమ ఫలితాలు పొందుతారు.

​ధనస్సు..

బుధుడు.. ధనస్సు రాశిలో 11వ పాదంలో ఉండనుంది. ఇది లాభం, ఆదాయం, సోదరుడుగా పరిగణిస్తారు. అంతేకాకుండా వివాహానికి ఓ కారకంగా పరిగణిస్తారు. వివాహం చేసుకున్న వారు ఈ సమయంలో బుధ ప్రభావం వల్ల ప్రయోజనం అందుకుంటారు. ధనస్సు రాశి వారికి వివాహ అవకాశాలు వస్తాయి. రోజువారీ ఉపాధి, వ్యాపార భాగస్వామ్యంలో ఊహించని విజయాన్ని పొందవచ్చు.

​మకరం..

మకర రాశిలో బుధుడు ఆగమనం వల్ల చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఉపాధి, వ్యాపారం పెరుగుతుంది. మీకిష్టమైన వారి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఈసారి అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీకు డబ్బు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సమయంలో వ్యాధులు, శత్రువులను నివారించాలి. అంతేకాకుండా ఈ సమయంలో సుదూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా మీరు లాభాలు అందుకునే అవాకశముంది.

​మీనం..

మీన రాశివారికి బుధుడు ప్రయోజనం ఉంటుంది. మీకు ఈ సమయంలో ఉత్తమమైన ఫలాలు లభిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయి. మీరు రోజువారీ వ్యాపారంలో ఉపాధి, ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా ఈ మార్పు శుభంగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరకు అనుకున్నది సాధిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.