యాప్నగరం

Solar Eclipse 2023 ఏప్రిల్‌లో తొలి సూర్య గ్రహణం.. ఈ 7 రాశులకు ఆర్థిక పరంగా కష్టాలు.. ఎలాంటి పరిహారాలు పాటించాలంటే...!

Solar Eclipse 2023 హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి సంవత్సరం అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 20వ తేదీన తొలి సూర్య గ్రహణం ఏర్పడనుంది.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 10 Apr 2023, 3:07 pm
Solar Eclipse 2023 జ్యోతిష్యశాస్త్రం నుంచి ఖగోళ శాస్త్రం వరకు సూర్య గ్రహణానికి సంబంధించి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్యం ప్రకారం సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో అనేక సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా ద్వాదశ రాశులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన మొదటి సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం ఉదయం 7:04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:29 గంటల వరకు ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో సూర్యుడు మేషరాశిలో, అశ్వినీ నక్షత్రంలో ఉంటాడు. ఈ సమయంలో కన్యరాశితో సహా 6 రాశులకు అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఆ రాశుల వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కోనున్నారు.. ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu solar eclipse 2023 these 7 zodiac signs are facing money problems in telugu
Solar Eclipse 2023 ఏప్రిల్‌లో తొలి సూర్య గ్రహణం.. ఈ 7 రాశులకు ఆర్థిక పరంగా కష్టాలు.. ఎలాంటి పరిహారాలు పాటించాలంటే...!


​మేష రాశి(Aries)..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కాలంలో మానసికంగా గందరగోళంగా పెరుగుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక అడుగు ముందుకు వేస్తే.. రెండడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది. ఈ టైములో ఎలాంటి మార్పు గురించి ఆలోచించొద్దు.

పరిహారం : సూర్యుడికి ఎర్రని పువ్వులను సమర్పించాలి.

Sun Transit in Aries మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ 5 రాశులకు నెల రోజుల పాటు అదృష్టం వరించనుంది...!

వృషభ రాశి (Taurus)..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు అనవసరంగా కోపం పెరుగుతుంది. సూర్య గ్రహణ ప్రతికూల ప్రభావం కారణంగా మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. మీరు ఇతరులకు ఆర్థిక పరంగా సహాయం చేయాల్సి ఉంటుంది. మీ వాహనం దెబ్బ తినడం వల్ల మీ ఖర్చులు పెరగొచ్చు.

పరిహారం : ప్రతి ఆదివారం సూర్యునికి నీటిని సమర్పించాలి.

కన్య రాశి (Virgo)..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో ఆరోగ్య పరంగా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పాత వ్యాధులు మళ్లీ బయటపడొచ్చు. వ్యాపారులు ఈ కాలంలో నష్టాలను చవిచూడొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. సహోద్యోగులు మీకు ఒత్తిడి పెంచొచ్చు. వ్యాపారులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.

పరిహారం : ప్రతిరోజూ సూర్యునికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి.

తులా రాశి (Libra)..

ఈ రాశి వారు తొలి సూర్య గ్రహణం ఏర్పడే సమయంలో ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. మీ తండ్రితో సంబంధాలు ప్రభావితం కావొచ్చు. ఉద్యోగులకు డబ్బుకు సంబంధించిన సమస్యలు రావొచ్చు. మీరు పొదుపు చేయలేరు. మీ పిల్లలు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. కెరీర్ పరంగా అశుభ ఫలితాలు రావడంతో మీ మనసులో చిరాకుగా ఉంటుంది.

పరిహారం : ప్రతి మంగళవారం గోధుమలను దానం చేయాలి.

వృశ్చిక రాశి(Scorpio)..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ జీవితంలో ఒకదాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంటుంది. మీ వైవాహిక జీవితం కూడా ప్రభావితమవుతుంది. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రతికూలతతో నిండి ఉంటుంది. కెరీర్ పరంగా ప్రతికూల ప్రభావం పడుతుంది. మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.

పరిహారం : ప్రతి ఆదివారం బెల్లం దానం చేయాలి.

మకర రాశి (Capricorn)..

ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో ప్రతికూల ఫలితాలు ఏర్పడనున్నాయి. వ్యాపారులు ఆకస్మికంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులలో కొందరికి ఆరోగ్య సమస్యలు పెరగొచ్చు. వ్యాపారులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ సూర్యునికి నీటి సమర్పించి, మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి.

మీన రాశి (Pisces)..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు మీ స్నేహితుల చేతిలో మోసపోవచ్చు. కెరీర్ పరంగా చాలా కష్టపడాల్సి వస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రాకపోవచ్చు. వ్యాపారులకు పెట్టుబడి తగ్గి గడ్డుకాలం ఎదురవుతుంది.

పరిహారం : మీ తండ్రి ఆశీస్సులు తీసుకుని ఉద్యోగానికి వెళ్లాలి.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read Latest Astrology News and Telugu News

రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.