ఏప్రిల్ మాసంలో ఈ 5 రాశుల వారిపై ప్రతికూల ప్రభావం
అప్రైజల్, ఇంక్రిమెంట్లు,పదోన్నతులు లాంటివి ఏప్రిల్ నెలలోనే ప్రారంభమవుతాయి. ఈ సారి గ్రహాల స్థితిలో ఈ మాసంలో పెద్ద మార్పు ప్రారంభం కానుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం రాశిచక్ర గుర్తులకు ఏప్రిల్ మాసం ముఖ్యమైందిగా పరిగణిస్తారు. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం హెచ్చుతగ్గులు ఉంటాయి.
మేషం..
మేష రాశి ప్రజలు ఈ నెలంతా తీరిక లేకుండా గడుపుతారు. సేల్స్ మార్కెటింగ్ రంగంలో ఉన్న వారు ఉరుకులు పరుగులతో పనిచేయాల్సి ఉంటుంది. కష్టపడి చేసినా విజయం మాత్రం తక్కువే ఉంటుంది. కొంత మందికి తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఏప్రిల్ మాసంలో అనవసర ఖర్చులు తెలుస్తాయి. అంతేకాకుండా ఈ నెల చివర్లో ఇబ్బంది ఉంంటుంది. నెల రెండో భాగంలో సూర్యుడు ఆగమనం వల్ల మీకు ప్రయోజనకరంగా మారవచ్చు. ఉత్సాహంతో, సంయమనంతో పనిచేయండి.
కర్కాటకం..
ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి ప్రజలకు చేదు అనుభవాలు ఉంటాయి. శారీరక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అయితే ఆరోగ్యం విషయంలో మీరు రాజీ పడకూడదు. ఆహారంపై నియంత్రణ కలిగి ఉండండి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. కానీ ఖర్చు మాత్రం అలాగే కొనసాగుతుంది. ఆర్థిక సమతూల్యత కష్టతరంగా అనిపిస్తుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల అధ్యయనం, ఆందోళన గురించి చెందుతారు.
సింహం..
ఏప్రిల్ నెలలో సింహ రాశి ప్రజలకు అనుకూలంగా ఉండదు. ఈ నెలలో ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు కోపాన్ని నియంత్రించకపోతే కుటుంబంలో సమస్యలు ఉంటాయి. పెట్టుబడి, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మధ్యలో సమయం అనుకూలంగా మారే అవకాశముంది. అధికారులతో విభేదాలు సృష్టించుకోవద్దు. లేకుంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ మాసంలో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి.
కన్య..
ఈ నెల ప్రారంభంలో బుధుడు నీచ స్థితిలో ఉండటం వల్ల మీ రాశిపై ప్రభావం పడుతుంది. కార్యాలయంలో మానసిక ఉద్రిక్తత, గందరగోళ స్థితిలో ఉంటుంది. వ్యాపార సంబంధిత వ్యక్తులు, ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందుతారు. ఈ నెల ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి చెప్పడం సాధ్యమే. విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు చదివిన విషయాన్ని మార్చిపోతారు.
మకరం..
గురుడు ఏప్రిల్లో మకరం నుంచి నిష్క్రమిస్తాడు. అయితే ఈ పరిస్థితిలో పెద్దగా ప్రభావం చూపదు. కానీ కుటుంబంలో శుభకార్యక్రమాలు ప్లాన్ చేయవచ్చు. కానీ ఇంట్లో సమస్యల వల్ల ఆగిపోతాయి. ఖర్చు మీ బడ్జెట్ ను మించిపోతుంది. కార్యచరణ ప్రణాళికలను పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. లేకుంటే వైఫల్యం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ రాశి వారు చాలామంది జీవిత భాగస్వామి ఆరోగ్యం, పిల్లల వైద్యం గురించి ఆందోళన చెందుతారు.