యాప్నగరం

సూర్యగ్రహణం వల్ల ఈ మూడు రాశుల వారికి అంతా శుభం..!

జూన్ 21న ఏర్పడిన సూర్యగ్రహణం వల్ల రాశిచక్రంలోని అన్ని రాశుల వారిపై ప్రభావం పడనుంది. అయితే మూడు రాశుల వారికి మాత్రం సర్వత్రా శుభదాయకంగా మారనుంది. మరి ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం.

Samayam Telugu 22 Jun 2020, 11:05 am
జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణాలు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే గ్రహాల స్థితిగతుల ఆధారంగా భూత, భవిష్యత్ వర్తమాన కాలాలను అంచనా వేస్తుంటారు పండితులు. అందులోనూ గ్రహణం రోజు వీటి ప్రభావం మనుషులపై ఇంకా ఎక్కువగా ఉంటుంది. జూన్ 21న ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడింది. గతేడాది డిసెంబరు 26 తర్వాత భారత్ లో గత ఆరు నెలలో కాలంలో పెద్ద గ్రహణం సంభవించలేదు. . ఈ గ్రహణం ఆ రోజు ఉదయం 9 గంటల 15 నిమిషాల 58 సెకండ్లకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 04 నిమిషాలకు సమాప్తమైంది. ఆదివారం సంభవించిన ఈ సూర్యగ్రహణం వల్ల రాశిచక్రంలోని అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ గ్రహణం వల్ల శుభఫలితాలు అందుతాయి. మరి ఆ రాశులేంటి? ఆ రాశుల వారిపై పడనున్న సానుకూల ప్రభావం గురించి ఇప్పుడు చూద్దాం.
Samayam Telugu these three zodiac sign will get benefit from solar eclipse 2020
సూర్యగ్రహణం వల్ల ఈ మూడు రాశుల వారికి అంతా శుభం..!



​మేషం..

సూర్యగ్రహణం వల్ల ఈ రాశి వారికి సంపద ప్రయోజనం దక్కుతుంది. ఈ రాశిచక్రంలోని మూడవ పాదంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. అంతేకాకుండా ఈ సూర్యగ్రహణం మీకు ప్రత్యేక ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. అంతేకాకుండా తోబుట్టువులు, సాహసం, మీ మాట్లాడే విధానాన్ని సూచిస్తుంది. వారి వ్యక్తిత్వంతో మీరు ఎలాంటి సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నారనేదాన్ని తెలియజేస్తుంది. సూర్యగ్రహణం మీకు ఏ సందర్భంలోనైనా హానికరం కాదు. అంతేకాకుండా ఈ గ్రహణం అన్ని సందర్భాల్లోనూ ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది.

​సింహం..

సూర్యగ్రహణం మీ రాశిచక్రంలోని 11వ పాదంలో జరగబోతోంది. ఈ గ్రహణం డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలను అందిస్తుంది. చాలా కాలంగా కొనసాగుతున్న ఏదైనా అసంపూర్ణ కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. సూర్యగ్రహణం ప్రభావం మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే.. ప్రజలతో మీ సంబంధం మునుపెన్నడూ లేనంత స్నేహంగా మారుతుంది. డబ్బు విషయంలో కూడా మీ స్థానం చాలా బలంగా ఉంటుంది. మొత్తంమీద ఈ గ్రహణం మీ రాశిచక్రానికి చాలా శుభదాయకంగా ఉంటుంది.

​మీనం..

ఈ సూర్యగ్రహణం మీ రాశిచక్రంలోని నాల్గవ పాదంలో ఏర్పడనుంది. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి వ్యవహారాల్లో ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం శుభ ప్రభావం వల్ల మీరు అన్ని కార్యకలాపాలలో అద్భుతమైన విజయాన్ని పొందుతారు. పెండింగ్‌లో ఉన్న చాలా పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. అయితే సూర్యగ్రహణం ప్రభావ వల్ల మీకు ఆరోగ్య సమస్యను వస్తాయి. ఈ సూర్యగ్రహణం వ్యాపారవేత్తలకు, ఉపాధి ప్రజలకు సానుకూల ఫలితాన్ని అందిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.