యాప్నగరం

Trigrahi Yoga In Capricorn మకరంలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులకు ధన లాభం...! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...

Trigrahi Yoga In Capricorn జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఆంగ్ల నూతన సంవత్సరంలో జనవరి 14వ తేదీ శనివారం రాత్రి సూర్యుడు మకరంలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మకర రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 14 Jan 2023, 1:56 pm
Trigrahi Yoga In Capricorn సాధారణంగా ఒక రాశిలో రెండు గ్రహాలు కలిస్తేనే ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. అలాంటిది ఒకే రాశిలో మూడు ప్రధాన గ్రహాలు కలయిక జరిపితే భిన్నమైన ఫలితాలు వస్తాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి వేళ మకర రాశిలో సూర్యుడు, శని భగవానుడు, శుక్ర గ్రహాలు కలయిక జరపనున్నాయి. ఈ సమయంలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఇలా మూడు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ద్వాదశ రాశుల జీవితాలు కచ్చితంగా ప్రభావితమవుతాయి. అయితే ఈసారి ఈ యోగం వల్ల మూడు రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా త్రిగ్రాహి యోగం ఏ రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu trigrahi yoga in capricorn on 14 january 2023 these zodiac signs will get good result in telugu
Trigrahi Yoga In Capricorn మకరంలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులకు ధన లాభం...! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...


మేష రాశి జాతకం 2023| వృషభ రాశి జాతకం 2023| మిధున రాశి జాతకం 2023 |కర్కాటక రాశి జాతకం 2023 |సింహ రాశి జాతకం 2023| కన్య రాశి జాతకం 2023 |తులా రాశి జాతకం 2023 |వృశ్చిక రాశి జాతకం 2023 |ధనస్సు రాశి జాతకం 2023| మకర రాశి జాతకం 2023 |కుంభ రాశి జాతకం 2023 |మీన రాశి జాతకం 2023

త్రిగ్రాహి యోగం ఎప్పుడంటే..

శని భగవానుడు గత ఏడాది 12 జూలై 2022 ఉదయం 10:27 గంటలకు మకర రాశిలోకి సంచారం చేశాడు. అదే ఏడాదిలో శుక్రుడు 29 డిసెంబర్ 2022న తెల్లవారుజామున 3:45 గంటలకు మకరంలోకి ప్రవేశించాడు. మరి ఇప్పుడు జనవరి 14వ తేదీన రాత్రి 8:22 గంటలకు సూర్యుడు కూడా మకర రాశిలోకి రవాణా చేయనున్నాడు. ఇలా మూడు గ్రహాలు మకరరాశిలో కలయిక జరిపినప్పుడు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మూడు రాశులకు ప్రత్యేక ఫలితాలొస్తాయి.

Venus Transit in Aquarius కుంభంలోకి శుక్రుడి రవాణాతో ఈ 3 రాశుల వారు ధనవంతులవుతారు...! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...

కన్య రాశి(Virgo)..

మకర రాశిలో మూడు ప్రధాన గ్రహాల కలయికతో కన్య రాశి వారు జనవరి మాసంలో అత్యంత అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కన్య రాశి నుంచి ఈ త్రిగ్రాహి యోగం ఐదో స్థానం నుంచి ఏర్పడుతుంది. ఈ కాలంలో ప్రేమ వివాహాలు, ప్రేమ సంబంధాలలో ఉండే వారికి, అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. మీ ఇంట్లో పిల్లలు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. యోగా విద్యార్థులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

తులా రాశి(Libra)..

ఈ రాశి వారు త్రిగ్రాహి యోగం వల్ల అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ రాశి నుంచి నాలుగో స్థానం నుంచి ఈ యోగం ఏర్పడనుంది. ఈ కాలంలో మీరు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలను పొందుతారు. కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే కొత్త కారు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా ఈ కాలంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది.

ధనస్సు రాశి(Sagittarius)..

ఈ రాశి నుంచి రెండో స్థానం నుంచి త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ కాలంలో ఉద్యోగులు కార్యాలయంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు అనేక వనరుల నుంచి ఆదాయం సమకూరుతుంది. దీంతో మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా మారుతుంది. వ్యాపారులు ఈ కాలంలో మంచి లాభాలను పొందుతారు. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కోర్టుకు సంబంధించిన కేసులలో మీరు విజయం సాధిస్తారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read Latest Astrology News and Telugu News

రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.