యాప్నగరం

Tulsi Plant Vastu Tips తులసి పూజ చేసే సమయంలో ఈ పనులు తప్పక చేయాలని గుర్తుంచుకోండి...

Tulsi Plant Vastu Tips హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే ప్రతిరోజూ తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీళ్లు పోసి పూజిస్తారు.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 19 Jan 2023, 7:42 pm
Tulsi Plant Vastu Tips మన దేశంలో హిందువులలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణంలో తులసి మొక్క కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల సానుకూల శక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ తులసి మొక్క గురించి అనేక గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడింది. శాస్త్రాల ప్రకారం విష్ణువుకు తులసి మొక్క అంటే ఎంతో ఇష్టం. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందడంతో పాటు విష్ణువు ఆశీస్సులు కూడా లభిస్తాయని పండితులు చెబుతారు. అయితే వాస్తు ప్రకారం తులసి పూజ చేసే సమయంలో కొన్ని పనులు తప్పకుండా చేయాలి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Tulsi puja 2023


తులసి కోట ఎదుట దీపం వెలిగించాలి..
వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతిరోజూ సాయంత్రం తులసి మొక్క ఎదుట ఆవు నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించాలి. అయితే మీరు వెలిగించే ప్రమిదకు కాస్త పసుపు కూడా రాయొచ్చు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. అంతేకాదు మీకు జీవితంలో మంచి లాభాలొస్తాయి.
Shani Amavasya 30 ఏళ్ల తర్వాత శనిశ్చరి అమావాస్య.. ఈ సులభమైన పరిహారాలతో శని దేవుని ఆశీస్సులు పొందొచ్చు...!

పిండితో దీపం వెలిగించాలి..
శాస్త్రాల ప్రకారం, తులసి మొక్క దగ్గర పిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి. ఆ మరుసటి రోజు ఆవుకు దాన్ని తినిపించాలి. ఇలా చేయడం వల్ల శుభఫలితాలొస్తాయి. లక్ష్మీదేవి, అన్నపూర్ణ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

తులసిని ఏ సమయంలో పూజించాలంటే..
ప్రతిరోజూ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి, స్నానం చేసిన అనంతరం తులసి చెట్టుకు నీటిని సమర్పించాలి. తులసి చెట్టుకు పూజ చేసే సమయంలో ఉతికిన బట్టలనే ధరించాలని గుర్తుంచుకోండి.

ధనానికి లోటు రాకుండా ఉండాలంటే..
ఎల్లప్పుడూ తులసి మొక్క కిందే దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీ జీవితంలో ధనానికి లోటు అనేదే ఉండదు. మత గ్రంథాల ప్రకారం తులసి చెట్టుకు ఆదివారం, ఏకాదశి రోజున నీళ్లు సమర్పించకూడదు. అంతేకాదు ఆ రోజున తులసి ఆకులను తెంచకూడదు. ఇలా క్రమం తప్పకుండా తులసి చెట్టును పూజించడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలోని సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read Latest Astrology News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.