యాప్నగరం

ఇల్లు కట్టబోయే స్థలంలో ఎముకలు కనిపిస్తే..

శల్య దోషం అంటే ఏమిటి.. ఇంటిని నిర్మించే స్థలంలో శల్య దోషం ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి. శల్యవాస్తు దోషాలు ఎన్ని రకాలుగా ఉంటాయి.. మనం తెలుసుకుందాం.

Samayam Telugu 25 Feb 2020, 4:03 pm
జీవితం శల్యం కాకూడదు అనుకుంటే.. మనము నిర్మించే గృహానికి శల్య దోషం లేకుండా నిర్మించుకోవాలి. శల్యం అంటే
Samayam Telugu what is shalya dhosha what it means if we found bones in the house constructing place
ఇల్లు కట్టబోయే స్థలంలో ఎముకలు కనిపిస్తే..

ఎముక, అస్థి, బొమిక, ముక్క. ఇలా చాలా రకాలుగా పిలుస్తుంటారు. మన వాడుక భాషలో చెప్పాలి అంటే ఎముకలు పెరగకుండా ఉంటే శరీరము కూసించుకుపోతుంది. అలాగే గృహనిర్మాణ స్థల భాగములో ఎముకలు ఉన్న ఆ గృహము కళ కళ లాడకుండా నక నక (కళా విహీనం) లాడుతోంది. ఇల్లు కట్టబోయే స్థలంలో ఎముకలు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో చూద్దాం.

రోగప్రాప్తి పాదశల్యమ్: ఒకవేళ గృహము నిర్మించు స్థలము క్రింది భాగములో పాదాలకు సంబంధించిన ఎముకల వలన నిరంతర రోగభాధలు ఉంటాయి.

గమనం జామశల్యకమ్: నిర్మాణ స్థలములో మోకాలు జాయింట్‌కు సంభందించిన ఎముకలు ఉన్న పరస్థల వాసము, అకాల ప్రయాణం, భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం చేస్తారు, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.

ఊరుశల్యమ్ ఋణంశైవ: ఇల్లు నిర్మించే స్థలంలో తొడ ఎముకలు ఉంటే..ఎంత రాబడి ఉన్నా అప్పులు చేయడం, వ్యాపార నష్టం, ఆస్తులు అమ్మి అప్పులు కట్టడం, అప్పులతో ఊరు వదలడం జరుగుతుంది.

స్త్రీనాశం గుహ్యశల్యకమ్: పక్కటేముకలు ఉన్న స్థలంలో అకాలంగా స్త్రీ మరణం, వివాహ విచ్చేదన (విడాకులు), ప్రసవ సమయంలో మరణం, అక్రమ సంబంధాలకు దారి తీస్తుంది.

బంధనమ్ బాహుశల్యేన: స్థలంలో చేతి ఎముకలు ఉంటేజైల్లో ఉండడం, సంతానం చొరత్వానికి అలవాటు పడి శిక్ష అనుభవించుట, హత్య పరిణామంలో జైలు, రాజకీయ పరంగా జైలు జీవితం ఎదురవుతుంది.

శిరోస్థి మరణం ధృవమ్: స్థలం క్రింది భాగములో తలకు సంబంధించిన ఎముకలు ఉన్న గృహ యజమాని అకాల మరణం, అకాలంగా అనారోగ్యం, వాహన ప్రమాదాలలో మరణం, తీవ్ర అనారోగ్యంతో మరణం పొందుట జరుగును.

విద్వేషం జాఘనం శల్యేన: స్థలంలో నడుము భాగమునకు సంబంధించిన ఎముకలు ఉన్న గృహంలో విద్వేషం, ఊరి జనాలతో వైరం, నిత్యం గృహంలో చెడు సంభాషణలు జరుగును. కొన్ని సందర్భాలలో స్త్రీ, పురుషుల ఎముకల సమూహము ఉన్న ఆ గృహంలో ఎక్కువగా అక్రమ సంబంధాలు కొనసాగే అవకాశం ఎక్కువ. మతాంతర వివాహాలు జరుగును.

పై విధంగా చాలా విధాలుగా శల్యవాస్తు దోషాలు ఉన్నాయి. తర్వాతి ఆర్టికల్‌లో పశువులు, పక్షులు, ప్రాణుల ఎముకల వలన ఏర్పడు దోషముల గురించి తెలుసుకొందాం. పరిహార క్రియ కూడా త్వరలో తెలియ పరుస్తాం.

- వాస్తుపురుష ప్రసాద్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.