యాప్నగరం

ఇంటి ఆవరణలో ఎలాంటి చెట్లు పెంచొద్దు? ఏ చెట్ల కలప గృహ నిర్మాణానికి వాడొద్దు?

ఇంటి ఆవరణలో కొన్ని రకాల చెట్లను పెంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే ఉసిరి, జమ్మి చెట్ల కలపను కూడా ఇంటి నిర్మాణానికి వాడొద్దని సూచిస్తోంది.

Samayam Telugu 6 Mar 2020, 8:21 pm
ఇంటి ఆవరణలో ఎలాంటి చెట్లు పెంచాలో ఇంతకు ముందు ఆర్టికల్‌లో తెలుసుకున్నాం. ఎలాంటి చెట్లు ఇంటి ప్రాంగణంలో ఉండొద్దు, ఎలాంటి చెట్ల కలప గృహ నిర్మాణానికి వాడొద్దు తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ఆవరణలో పాలు కారే వృక్షాలు ఉండరాదు. వినాయకుడిని పూజించటానికి తెల్ల జిల్లేడు శ్రేష్ఠం అనే భావనతో ఈ మొక్కను ఇటీవలి కాలంలో ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. కానీ ఇలా పెంచకూడదు. గృహ ఆవరణలో ముళ్ల చెట్లు పెంచకూడదు.
Samayam Telugu house


గృహ నిర్మాణానికి ఉసిరి, జమ్మి చెట్ల కలపను వాడరాదు. ఇంటి నిర్మాణం కోసం కాలిన వృక్షం నుంచి కలప సంగ్రహించడం దోషం. గృహ నిర్మాణానికి దేవాలయ ఆవరణంలోని వృక్షాల కలపను వాడరాదు. ఆడబిడ్డ ఇంటి నుంచి కలప తీసుకొని గృహ నిర్మాణం చేపట్టొద్దు. డబ్బు చెల్లించి కూడా తీసుకోవద్దు. అలాగే కలపను దొంగిలించి గృహ నిర్మాణం చేయరాదు. యజమాని జన్మనక్షత్రానికి శత్రు నక్షత్రమైన వృక్షంతో నిర్మాణం చేయరాదు.

తేనె పట్లు పెట్టిన చెట్ల నుంచి కలపను సంగ్రహించరాదు. ఇలాంటి వృక్షాలతో నిర్మాణం చేసిన గృహంలో తీపి కబుర్లు లేకుండా పోయి దుఃఖం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేవతల పేరున ఉన్న చెట్లు అంటే.. చెట్ల కింద దేవతావిగ్రహాలు ఉన్న వృక్షాలతో గృహానిర్మాణం చేయడం అశుభకరం. గ్రామాల్లో చెట్ల కింద కూర్చొని జనం అనేక అంశాల గురించి మాట్లాడుకుంటుంటారు. ఇలా పది మందికి నీడనిచ్చే చెట్ల కలపతో నిర్మాణం చేస్తే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలుంటాయి.

సాధు సంతులు నిద్రించిన వృక్షాలు గృహ నిర్మాణానికి పనికిరావు. ఒకదానితో మరొకటి కలిసి ఉన్న వృక్షాల కలపతో గృహ నిర్మాణం చేస్తే భార్యాభర్తలు విడిపోయే ప్రమాదం ఉంది.

కొన్ని చెట్లపై మూలికలు మొలుస్తాయి. ఇలాంటి చెట్లను, ఏనుగులను కట్టేయడానికి వాడిన చెట్లను, తీగలు చుట్టుకొని ఉన్న చెట్ల కలపను ఇంటి నిర్మాణానికి వాడొద్దు. చెట్ల వీరుల ప్రతిమలు ఉంటే.. అలాంటి చెట్లను గృహనిర్మాణంలో ఉపయోగించరాదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.