యాప్నగరం

అరచేతిలో ఈ గీతలుంటే వారు పుట్టుకతోనే ధనవంతులు..!

చేతిలో ఈ గీతలు ఉన్నవారు పుట్టుకతోనే ధనవంతులు లేదా కాలక్రమేణా కోటీశ్వరులు అవుతారని విశ్వసించాలి. అంటే కొన్ని ప్రత్యేక శ్రేణుల ప్రజల జీవితాల్లో డబ్బు కొరత అస్సలు ఉండదు. వారికి జీవితంలో సంపద వారి వెంటే వస్తుంది. ఫలితంగా అపారమైన ధనలాభాన్ని అందుకుంటారు.

Samayam Telugu 23 Jan 2021, 6:42 am
హస్తరేఖాశాస్త్రంలో అపారమైన ధనలాభం, సంపద ప్రయోజనం కోసం కృషి చేయడంతో పాటు కొన్ని రేఖలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. చేతిలో ఈ గీతలు ఉన్నవారు పుట్టుకతోనే ధనవంతులు లేదా కాలక్రమేణా కోటీశ్వరులు అవుతారని విశ్వసించాలి. అంటే కొన్ని ప్రత్యేక శ్రేణుల ప్రజల జీవితాల్లో డబ్బు కొరత అస్సలు ఉండదు. వారికి జీవితంలో సంపద వారి వెంటే వస్తుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఫలితంగా అపారమైన ధనలాభాన్ని అందుకుంటారు. ఈ నేపథ్యంలో మిలియనీర్లను చేసే ఈ పంక్తులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Samayam Telugu according to palmistry millionaire signs in palm
అరచేతిలో ఈ గీతలుంటే వారు పుట్టుకతోనే ధనవంతులు..!



​మీ చేతిలో ఇలాంటి రేఖ ఉంటే..

హస్తరేఖాశాస్త్రం ప్రకారం మీ ఎడమ చేతిలో బుధుడు నుంచి నిష్క్రమించిన రేఖ చంద్రు పర్వతం వద్ద కలిసి, జీవన రేఖ కూడా చంద్ర పర్వతం వద్ద ఆగినట్లయితే మీకు అదృష్టం బాగా కలిసివచ్చిందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీకు అపారమైన ధనం ప్రాప్తిస్తుందని తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇలాంటి రేఖలు మీ చేతిలో అదృష్టం మీ వెంటే ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.

​చేతిలో ఈ రేఖ ఉంటే అపారమైన సంపద..

హస్తరేఖాశాస్త్రం ప్రకారం ఎవరైనా వ్యక్తి చేతిలో మస్తిష్కరేఖ అంగారక పర్వతం నుంచి బయటకు వెళ్తుంటే వారికి అపారమైన సంపద వస్తుంది. అంతేకాకుండా అదృష్ట రేఖ జీవనరేఖ నుంచి దూరంగా ఉండి అన్ని గ్రహాలు స్థిరంగా ఉండి అదృష్ట రేఖ సముద్ర నుంచి శని పర్వతంపై ముగిసినట్లయితే వారి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాకుండా వ్యాపారంలో ధనలాభం అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పదొన్నతులు ఉంటాయి.

​ఈ రేఖ ఉంటే డబ్బు కొరత ఉండదు..

హస్తరేఖాశాస్త్రం ప్రకారం ఎవరికైనా చేతిలో శని పర్వతంగుండా అదృష్ట రేఖ వెళ్లినట్లయితే హస్తసాముద్రికం ప్రకారం చాలా శుభకరంగా భావిస్తారు. అంతేకాకుండా చంద్రుడు.. అదృష్ట, మస్తిష్క రేఖలు త్రికోణాకృతిలో ఏర్పడితే అలాంటి జాతకులకు జీవితంలో డబ్బు కొరతనేదే ఉండదు. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ ఆదాయం ఉంటుంది. చేపట్టిన పనులు, ప్రారంభించన వ్యవహారాలను అడ్డంకుల లేకుండా అధిగమిస్తారు.

​ఈ రేఖ ఉంటే వారు పుట్టుకతోనే ధనవంతులు..

హస్తరేఖాశాస్త్రం ప్రకారం ఏ వ్యక్తి చేతిలోనైనా అదృష్ట చంద్రుడు నుంచి బయటకు వెళ్లినట్లయితే వారికి అదృష్టం కలిసి వచ్చినట్లే. అయితే బొటనవేలు కింద నుంచి ఆగిపోతే ఆ సమయంలో ముగింపు పలుకుతారు. అయితే జీవనరేఖ, మస్తిష్క రేఖ ఎలాంటి లోపం లేకుండా ఉంటే ఆ జాతకులు పుట్టుకతోనే ధనవంతులు అవుతారు. అంతేకాకుండా వారి చుట్టూ ఎప్పుడూ డబ్బే ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.