ధోనీ పుట్టిన తేదీ..
భారత క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన సారథుల్లో ముందు వరుసలో ఉండే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. భారత్ కు అంతర్జాతీయ ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్ తో కలిపి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత మహేంద్రుడు ఒక్కడికే చెల్లింది. అంతేకాకుండా అతడి కెప్టెన్సీలోనే భారత్ టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకు సాధించింది. ఇంత ఘనత సాధించిన ధోనీ 1981 జులై 7వ తేదీన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జన్మించాడు. తన పుట్టిన తేదీ 7నే తన జెర్సీ నెంబర్ గా మలుచుకున్నాడు మన కెప్టెన్ కూల్. ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో జెర్సీ నెంబర్ కూడా ఏడే కావడం విశేషం.
'7' సంఖ్యకు పాజిటివ్ ఎనర్జీ..
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏడో తేదీని పుట్టడం కొంతమంది అదృష్టంగా భావిస్తారు. అంతేకాకుండా ప్రపంచంలోనే వారు ఎంతో తెలివైన వారిగా, అదృష్టవంతులుగా భావిస్తారు. పనిప్రదేశంలోనూ మంచి రికార్డులు అందుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం ప్రతి సంఖ్యకు ఎంతో కొంత శక్తి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే 7వ నెంబర్ కు ఆధ్యాత్మిక ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కొంత సానుకూలత ఉంది. అంతేకాకుండా ఇది ఇతర సంఖ్యల మాదిరి కాకుండా అసాధారణమైనది.
లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చు..
సంఖ్యాశాస్త్రాన్ని ఆధ్యాత్మికతతో కలిపినపుడు కొన్ని ప్రయోజనాలు అందుతాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి జీవితంలో 7వ సంఖ్యకు పదే పదే సంబంధం ఏర్పడుతున్నట్లయితే అంటే ఏదొక విషయంలో 7వ సంఖ్యకు కొనసాగినట్లయితే దాన్ని అంత తేలికగా తీసుకోకూడదు. ఈ నెంబర్ వారి భవిష్యత్తులో చాలా మార్పులు చేస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా జీవితంలో సంపదను ఆర్జించడానికి, సరైన మర్గంలో ప్రయాణంలో ఉందని భావిస్తే ఈ సంఖ్య మెరుగుపరుస్తుంది. అందుకే ఈ నెంబర్ ను లక్కీ నెంబర్ గా కలిగి ఉండటం ద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చు.
వృత్తి, వ్యాపారాల్లోనూ 7వ సంఖ్యే..
ఎవరైన వ్యక్తి 7వ తేదీని సెంటిమెంటుగా భావించినపుడు వారి జీవితంలో వృత్తి లేదా ఉద్యోగాన్ని 7వ తేదీనే ప్రారంబించాలని అనుకుంటారు. ఫలితంగా వారు విజయవంతులవుతారని నమ్ముతారు. అంతేకాకుండా జీతం కూడా 7వ తేదీనే స్వీకరించడం ద్వారా వారు విజయాన్ని అందుకుంటారు. ఈ విధంగా న్యూమరాలజీ ఎక్కువగా నమ్మేవాల్లు 7ను తమ అదృష్ట సంఖ్యగా భావిస్తారు. అంతేకాకుండా వారి జీవితంలో 777 అనే నెంబర్ ను ఎక్కువ అదృష్టంగా భావించి దురదృష్టాల దూరంగా ఉంటారు.
ఏడో సంఖ్య కలిగిన వ్యక్తిత్వ లక్షణాలు..
జ్యోతిషశాస్త్రం ప్రకారం 7వ సంఖ్యను నెప్ట్యూన్ గ్రహాన్ని సూచిస్తుంది. ఇది చంద్రుడికి లోతుగా సంబంధాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు ఎంతో స్వతంత్రంగా, బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. నిశ్శబ్దంగా ఉంటారు. అదేవిధంగా కష్టపడి పనిచేస్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటారు. వారు సత్యాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపరు. విద్యపట్ల ఎల్లప్పుడూ కోరికను కలిగి ఉంటారు. వ్యక్తుల నుంచే.. విశ్వం నుంచి నేర్చుకోవాలనే కోరిక కూడా ఉంటుంది. శాస్త్రవేత్తలు, నిపుణులు, న్యాయసలహాదారు, పెట్టుబడిదారుడిగా చెలామణి అవుతారు.