యాప్నగరం

రాహు-కేతువుల స్థాన చలనం.. 4 రాశులపై దుష్ప్రభావం..!

స్వభావ రీత్యా ఎల్లప్పుడూ తిరోగమించే రాహు-కేతువులు.. వేరే ఇతర గ్రహాల దగ్గరకు వచ్చినప్పుడు గ్రహణంగా మారుతుంది. ఈ విధంగా రాహు-కేతువులు తమ స్థానాలను మార్చుకోవడం వల్ల నాలుగు రాశుల వారికి నష్టం వాటిల్లుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Samayam Telugu 29 Aug 2020, 7:40 pm
జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకుంటాయనే సంగతి తెలిసిందే. గ్రహాల్లో ఛాయ గ్రహాలుగా భావించే రాహువు, కేతువులు వచ్చే నెలలో తమ స్థానాన్ని మార్చుకోనున్నాయి. అంటే ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించనున్నాయి. సెప్టెంబరు 23న రాహువు మిథునం నుంచి వృషభంలోకి .. కేతువు ధనస్సు నుంచి వృశ్చికంలోకి రవాణా చెందున్నాయి. అందుకే వీటిని ఛాయ గ్రహాలుగా పరిగణిస్తారు. వీటి వల్ల కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడనుంది. స్వభావ రీత్యా ఎల్లప్పుడూ తిరోగమించే ఈ గ్రహాలు వేరే ఇతర గ్రహాల దగ్గరకు వచ్చినప్పుడు గ్రహణంగా మారుతుంది. ఈ విధంగా రాహు-కేతువులు తమ స్థానాలను మార్చుకోవడం వల్ల నాలుగు రాశుల వారికి నష్టం వాటిల్లుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Samayam Telugu rahu ketu will transit their position and these 4 zodiac sign will be in loss
రాహు-కేతువుల స్థాన చలనం.. 4 రాశులపై దుష్ప్రభావం..!



​మేషం..

రాహువు, కేతువులు రవాణా వల్ల మేషం రాశి వారికి ప్రతికూలంగా మారనుంది. ఫలితంగా వీరి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశముంది. దీని వల్ల ఈ రాశివారు డబ్బును కోల్పోతారు. అంతేకాకుండా పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వివాహం చేసుకుందామనుకునేవాళ్ల వారి వివాహం ఆగిపోవచ్చు. వీరు తలపెట్టిన పనులు, వ్యవహారాల్లో అవరోధాలు ఎదురవుతాయి. వీరు వేసుకునే ప్రణాళికలకు విరామాలు వస్తాయి.

​సింహం..

రాహు-కేతువుల తిరోగమనం వల్ల సింహ రాశివారికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది. భూముల, స్థిరాస్తుల వివాదాల్లో చిక్కుకునే ప్రమాదముంది. భూములు క్రయవిక్రయాల్లో తగిన లాభాలు రాకపోవడమే కాకుండా నష్టాలు వచ్చే అవకాశముంది. ప్రేమ సంబంధిత అంశాల్లోనూ వైఫల్యం ఎధురవ్వచ్చు. మీకున్న విపరీతమైన కోపం వల్ల మీ పని నాశనమయ్యే అవకాశముంది. కాబట్టి సింహ రాశివారు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

​తుల..

రాహువు, కేతువుల కదలిక వల్ల తుల రాశివారికి నష్టం వాటిల్లే అవకాశముంది. మీ చేతి ఖర్చులు మరిత పెరిగే అవకాశముంది. అంతేకాకుండా తగిన సౌకర్యాలు అందకపోవచ్చు. ఎంతో కాలంగా మీకు విశ్వాసపాత్రులుగా, నమ్మకస్తులుగా ఉన్న వారి ద్వారా బాధలు వచ్చే అవకాశముంది. ఎవరికైతే మీరు సహాయం చేస్తారో.. వారే మీకు వ్యతిరేకంగా నిలబడతారు. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండటమం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం.

​వృషభం..

రాహువు దుష్ప్రభావం వల్ల తుల రాశివారు తీవ్రంగా ప్రభావితమవుతారు. ఈ రవాణా వల్ల సమస్యలు ఇంకా పెరుగుతాయి. వ్యాపారంలో తగిన లాభాలు రాకపోగా నష్టాలు వచ్చే అవకాశముంది. ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ సమయంలో మీరు ఏవైనా ఒప్పందాలు ఒప్పుకున్నట్లయితే భారీ నష్టాలను ఎదుర్కొనే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉంటే మంచిది.

​పరిహారాలు..

రాహువు-కేతువుల ప్రభావం మీ పడకుండా ఉండాలంటే కొన్ని పరిహారాలు(రెమిడీలు) తప్పకుండా పాటించాల్సిందే. నల్ల నువ్వులు, వడ్లను ఓ వస్త్రంలో మూటలా కట్టి నెత్తిపై ఉంచుకోవాలి. అనంతరం ఏడు సార్లు ప్రదక్షిణ చేసి ప్రవహిస్తున్న నీటిలో పడేయాలి. ఇది కాకుండా కత్తి, నలుపు రంగు దుప్పటి గుడికి దానంగా ఇవ్వాలి. దీని ద్వారా గ్రహాల నుంచి వచ్చే అశుభ ప్రభావం తొలుగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.