యాప్నగరం

Sri Krishna Janmashtami 2022 కృష్ణాష్టమి వేళ మీ రాశిని బట్టి ఈ మంత్రాలను పఠిస్తే కన్నయ్య అనుగ్రహం కచ్చితంగా లభిస్తుంది..!

Sri Krishna Janmashtami 2022 కృష్ణాష్టమి పర్వదినాన శ్రీ కృష్ణుని భక్తులు ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. అయితే కన్నయ్య అనుగ్రహం పొందడానికి మాత్రం కొన్ని మంత్రాలను పఠించాలి. ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ రాశిని బట్టి ఏయే మంత్రాలను పఠిస్తే శ్రీ కృష్ణుని అనుగ్రహం లభిస్తుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 18 Aug 2022, 3:25 pm
Sri Krishna Janmashtami 2022 హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో అష్టమి రోజున కృష్ణాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజునే చిన్ని కృష్ణుడు జన్మించాడని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 18, 19వ తేదీన అష్టమి తిథి రావడంతో రెండు రోజుల పాటు కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ సమయంలో వేణు మాధవుని ఆలయాల్లో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉట్టి పగులగొట్టడం, గ్రామోత్సవం వంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన పర్వదినాన శ్రీ కృష్ణుని భక్తులు ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. అయితే కన్నయ్య అనుగ్రహం పొందడానికి మాత్రం కొన్ని మంత్రాలను పఠించాలి. ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ రాశిని బట్టి ఏయే మంత్రాలను పఠిస్తే శ్రీ కృష్ణుని అనుగ్రహం లభిస్తుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu sri krishna janmashtami 2022 chant krishna mantras according to your zodiac sign in telugu
Sri Krishna Janmashtami 2022 కృష్ణాష్టమి వేళ మీ రాశిని బట్టి ఈ మంత్రాలను పఠిస్తే కన్నయ్య అనుగ్రహం కచ్చితంగా లభిస్తుంది..!


​మేష రాశి..

ఈ రాశి వారు కృష్ణాష్టమి రోజున ‘ఓం కమలనాథాయ నమః’ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మీరు వేణు మాధవుని అనుగ్రహాన్ని పొందుతారు.

ఆ గుడిలో కన్నయ్యకు ఎడతెగని ఆకలి.. నైవేద్యం తగ్గితే విగ్రహం సైజు కూడా తగ్గిపోతుంది...

​వృషభ రాశి..

ఈ రాశి వారు కృష్ణాష్టమి పర్వదినాన కృష్న-అష్టకం పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంటుంది. మీకు కన్నయ్య అనుగ్రహం లభిస్తుంది.

​మిధున రాశి..

ఈ రాశి వారు కృష్టాష్టమి సందర్భంగా ‘ఓం గోవిందాయ నమః’ అనే మంత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలను పొందుతారు.

​కర్కాటక రాశి..

ఈ రాశి వారు కృష్ణాష్టమి రోజున ఉపవాసం ఉండాలి. పూజ చేసే సమయంలో రాధాకృష్ణకు సంబంధించిన మంత్రాలను పఠించడం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు.

​సింహ రాశి..

ఈ రాశి వారు కృష్ణాష్టమి పండుగ రోజున ‘ఓం కోటి సూర్య సంప్రభాయ నమః’ అనే మంత్రాన్ని పఠించాలి. ఈ సమయంలో దేవకీ నందులు సంతోషపడి మీరు కోరుకున్న కోరికలను నెరవేరుస్తారు.

​కన్య రాశి..

ఈ రాశి వారు కృష్ణాష్టమి రోజున కన్నయ్యను మనస్ఫూర్తిగా

ఆరాధించాలి. ‘ఓం దేవకీ నందనాయ నమః’ అనే మంత్రాన్ని పఠించాలి.

Sri Krishna Janmashtami 2022 దక్షిణాదిలో ప్రముఖ కృష్ణుని దేవాలయాలివే... ఆ గుడిలో మాత్రం నవ రంధ్రాల కిటికీ నుండే పూజలు...

​తుల రాశి..

ఈ రాశి వారు కృష్ణాష్టమి రోజున ‘ఓం లీలా-ధారాయ నమః’ అనే మంత్రాన్ని పఠించడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి.

​వృశ్చిక రాశి..

ఈ రాశి వారు కృష్ణాష్టమి రోజున విష్ణువు దశావతారాల్లో ఒకటైన వరాహ రూపాన్ని స్మరించుకోవాలి. అదే సమయంలో ‘ఓం వరః నమః’ అనే మంత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

​ధనస్సు రాశి..

ఈ రాశి వారు కృష్ణాష్టమి పర్వదినాన వేణు మాధవుడిని స్మరించుకుంటూ ‘ఓం జగద్గురువే నమః’ అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.

​మకర రాశి..

ఈ రాశి వారు కృష్ణాష్టమి రోజున ‘ఓం పుత్నా-జీవిత హరాయై నమః’ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

​కుంభ రాశి..

ఈ రాశి వారు కృష్ణాష్టమి రోజున ‘ఓం దయానిధాయ నమః’ అనే మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల మీ దాంపత్య జీవితంలో సంతోషంగా మారుతుంది.

​మీన రాశి..

ఈ రాశి వారు కృష్ణాష్టమి రోజున కన్నయ్యను స్మరించుకుంటూ ‘ఓం యశోద-వత్సలా నమః’ అనే మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల మీరు మీ ప్రయత్నాల్లో విజయాలను సాధిస్తారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, జ్యోతిష్య పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.