యాప్నగరం

సరసాలాడటంలో ఈ 5 రాశుల వారు నేర్పులు.. మాటలతో మాయ చేస్తారు

ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడటం వీరిలో ఉన్న సహజ లక్షణం. సరసాలాడటం(Flirting) వీరికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి వ్యక్తులు తరచూ సరసాలాడుతూ అందుకు తగినట్లుగా మృదువుగా ప్రవర్తిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న రాశుల వారున్నారు.

Samayam Telugu 24 Feb 2021, 7:51 am
అందం కంటే.. అందమైన మాటల ద్వారా ఎదుటివారు సులభంగా ఆకర్షితులవుతారనేది అందరికి తెలిసిన విషయమే. వీరినే సరసులు అంటారు. ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడటం వీరిలో ఉన్న సహజ లక్షణం. సరసాలాడటం(Flirting) వీరికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి వ్యక్తులు తరచూ సరసాలాడుతూ అందుకు తగినట్లుగా మృదువుగా ప్రవర్తిస్తారు. అప్రయత్నంగానే ప్రజల హృదయాల్లో చోటు సంపాదిస్తారు. ఇతరులను ఆకర్షించేలా మాట్లాడటమే కాకుండా పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడంలో నేర్పులు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న రాశుల వారున్నారు. అప్రయత్నంగానే ఆ రాశులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Samayam Telugu these are the zodiac signs who are very flirtatious
సరసాలాడటంలో ఈ 5 రాశుల వారు నేర్పులు.. మాటలతో మాయ చేస్తారు



​సింహం..

సింహ రాశి వారికి జనాకర్షణ శక్తిపై ఆధారపడతారు. అంతేకాకుండా వీరు సరసాలాడటంలో మాస్టర్స్. వారు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ఎవరినైనా ఇష్టపడితే వారితో సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. నేరుగా కళ్లల్లోకి చూస్తూ మాట్లాడుతూ ఉల్లాసభరితమైన సరసాలతో వారి దృష్టిని ఆకర్షించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. మృదువైన మాటలతో ఆకట్టుకోవడంలో ముందుంటారు.

​మిథునం..

మిథున రాశి ప్రజలు సులభంగా కలిసి పోతారు. ఎవరితోనైనా చొరవ తీసుకునే మాట్లాడతారు. ఈ లక్షణమే వారిని అంత సులభంగా మాట్లాడేలా చేస్తుంది. అంతేకాని సరసాలాడటం గురించి వీరికి తెలియదు. ఎందుకంటే అవతలి వ్యక్తి అందంతో ఆకర్షిలతులైనప్పటికీ నిజాయితీగా ఉంటారు. ఎదుటి వారి భావాలను అంగీకరిచండంలో చిత్తశుద్ధితో ఉంటారు. మాటలతో మంత్రముగ్ధులను చేస్తారు.

​ధనస్సు..

ధనస్సు రాశి ప్రజలు కొత్త విషయాలను అనుభవించడానికి ఇష్టపడతారు. నూతన వ్యక్తులను కలుసుకోవడాన్ని ఇష్టపడతారు. ఫలితంగా సరసాలాడటంలో వారి వ్యక్తిత్వంలో ఓ భాగం అవుతుంది. అంతేకాకుండా మృదువుగా మాట్లాడేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే వారు ఆసక్తి కలిగి ఉన్నారని మీకు తెలియజేయడానికి వారు చాలా ఆసక్తిగా ఉన్నారు.

​వృశ్చికం..

వృశ్చిక రాశి వారు చూసేందుకు ఆకర్షణీయంగా ఉన్నందున ఈ విషయంలో వీరిని ఎవ్వరూ ఆపలేరు. ఎదుటివారిని తమ మాటలతో ఆకర్షించడంలో ముందుంటారు. అంతే శక్తిమంతమైందిగానే కాకుండా తీవ్రంగా కనిపిస్తారు. కాబట్టి మొదట ఆహ్వానించదగినదిగా అనిపించకపోవచ్చు. అయితే వారు మాట్లాడటం ప్రారంభిస్తే సరసమైన వ్యక్తిత్వంతో సులభంగా ఆకట్టుకుంటారు. మహిళలను తేలికగా ఆకర్షిస్తారు.

​తుల..

సరసాలాడటంలో చాలా సూక్ష్మంగా ఉంటారు. సామాజికంగా, స్నేహపూర్వక వ్యక్తులు. సాధారణంగా నవ్వుతూ మాట్లాడుతూ ఎదుటివారిని ఆకర్షిస్తారు. ఈ మాటల ద్వారా వారు మీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారని తెలుస్తుంది. అయితే మీకు ఏం చెప్పాలో కచ్చితంగా తెలుసు. తద్వారా మీరు ఎప్పుడైనా కోపం లేదా ఆసక్తి చూపరు. ఎదుటివాళ్లు చెప్పే మాటలను సులభంగా అర్థం చేసుకొని ప్రవర్తించడంలో నేర్పులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.