యాప్నగరం

Astrology Predictions 2023 వచ్చే ఏడాదిలో రాజయోగం వల్ల ఈ రాశుల వారికి సొంతింటి కల నెరవేరొచ్చు...!

Astrology Predictions 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి రంగానికి వేర్వేరు ఇంటి స్థానాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో భూమి, ఆస్తి వంటి వాటికి గురు గ్రహాన్ని కారకుడిగా భావిస్తారు. అదే విధంగా శని, శుక్రుడితో పాటు ఇతర గ్రహాలు కూడా ఇంటికి సంబంధించిన లక్షణాలను సూచిస్తాయి. గ్రహాల ప్రభావంతో 2023లో ఏ రాశి వారికి ఇల్లు కొనేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 13 Dec 2022, 11:23 am
Astrology Predictions 2023 మనలో చాలా మందికి సొంతింటిని కొనాలని.. అందులో దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చోవాలని.. కలలు కంటూ ఉంటారు. ముఖ్యంగా అద్దె ఇంట్లో ఉండే వారైతే అద్దెల భారాన్ని భరించడం కంటే సొంత ఇంటిని కొనడం మేలని భావిస్తుంటారు. అయితే సొంత ఇంటిని కట్టుకోవడం అంత ఈజీ కాదు. అందుకే మన పెద్దలు ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనే మాటను తరచుగా వాడుతూ ఉంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సొంత ఇల్లు, వివాహం, ఆస్తి, భవనాలు, భూమి వంటి సంపదలకు గురువు(బృహస్పతి)ను కారకంగా పరిగణిస్తారు. ఈ గురువు ప్రభావంతో 2023లో రాజయోగం ఏర్పడి కొన్ని రాశుల వారు తమ సొంత ఇంటి కలను నిజం చేసుకుంటారు. ఈ సందర్భంగా ఆ రాశి చక్రాలేవి.. అందులో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...
Samayam Telugu which zodiac sign can own a house in 2023
Astrology Predictions 2023 వచ్చే ఏడాదిలో రాజయోగం వల్ల ఈ రాశుల వారికి సొంతింటి కల నెరవేరొచ్చు...!


​మిధున రాశి(Gemini)..

ఈ రాశి వారు 2023 కొత్త సంవత్సరంలో సొంతింటి కల నెరవేర్చుకోవడంలో సక్సెస్ అవుతారు. అలాగే ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ చేసుకునే వారికి కూడా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు సంవత్సరం ప్రారంభంలో, మీరు స్థిరమైన ఆస్తులను కొనుగోలు చేయకుండా ఉండాలి. సంవత్సరం మధ్యలో శని దేవుని అనుగ్రహం వల్ల మీకు శుభ ఫలితాలు, మంచి లాభాలొస్తాయి.

రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.