యాప్నగరం

త్వరలో రానున్న మహీంద్రా ఎక్స్ యూవీ 300.. పవర్ ఔట్ పుట్ చూస్తే అదిరిపోవాల్సిందే

ఇటీవల దిల్లీలో జరిగిన 2020 ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించింది మహీంద్రా ఎక్స్ యూవీ 300 వాహనాన్ని వచ్చే నెలలో భారత విపణిలో లాంచ్ చేసేందుకు సంస్థ తయారవుతుంది. దీనికి 1.2 లీటర్ టీ-జీడీఐ ఇంజిన్ ను అమర్చారు.

Samayam Telugu 6 Mar 2020, 12:13 pm
మహీంద్రా ఎక్స్ యూవీ 300 స్పోర్ట్జ్స్ వాహనం ఎప్పుడెప్పుడు భారత మార్కెట్లో విడుదలవుతుందా అని వాహనప్రియుల ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే దిల్లీలో జరిగిన 2020 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన ఈ వాహనం అందరి చూపును తన వైపునకు తిప్పుకుంది. అయితే ఈ వాహనం త్వరలో భారత విపణిలో విడుదల చేసేందుకు సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ఏప్రిల్లో ఎక్స్ యూవీ 300 మోడల్ ను లాంచ్ చేసేందుకు నిర్ణయించింది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్లను అందుబాటులోకి తీసుకురానుంది.
Samayam Telugu మహీంద్రా ఎక్స్ యూవీ 300


Also Read:BS6 WR-V: త్వరలో హోండా నుంచి సరికొత్త కారు.. అనుకున్నదానికంటే ముందే
ఎక్స్ యూవీ 300 మోడల్ వెనక భాగంలో రేర్ బ్రేక్ క్యాలిపర్లు, రెడ్ ఫ్రంట్ బాడీవర్క్ తో ఆకట్టుకుంటోంది. ఇంజిన్ ను గమనిస్తే 1.2 లీటర్ టీ-జీడీఐ టర్బోఛార్జెడ్, డైరెక్ట్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగిఉండి 130 పీఎస్ పవర్, 230 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ అయితే 20 పీఎస్ పవర్, 30 ఎన్ఎం టార్క్ అధికంగా ఉంది. అంతేకాకుండా 6-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. కారు అంతర్భాగం మొత్తం నలుపు రంగుతో ఉండి ఎరుపు రంగు సీట్లతో ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం టాటా నెక్సాన్ హ్యుండాయ్ వెన్యూ మాత్రమే ఈ సిగ్మెంట్లో సిగ్మెంట్లో పెట్రోల్ పవర్ తో పనిచేస్తున్నాయి. అవి 120 పీఎస్ పవర్, 170 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఎక్స్ యూవీ 300 లాంచ్ అయితే 10 పీఎస్ పవర్, 160 ఎన్ఎం టార్క్ ను అధికంగా ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. టీ-జీడీఐ ఇంజిన్ మూడు సిలీండర్లను కలిగి ఉండి హై బూస్ట్ ప్రెజర్, డైరెక్ట్ ఇంజెక్షన్, శక్తివంతమైన ఇంటర్నల్ కాంపోనెంట్స్ ద్వారా మెరుగైన పవర్ ఔట్ పుట్ ఇస్తుంది. సబ్-4ఎం ఎస్ యూవీ సిగ్మెంట్లో అప్ డేట్ చేసిన ఇంజిన్ కోసం ఎక్కువ మంది వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. కారణం పవర్ ఔట్ పుట్ మెరుగవ్వడమే కాకుండా డ్రైవింగ్ ప్రదర్శన కూడా బాగా ఉంటుందని వారు భావిస్తున్నారు.

Also read:Highway Tips: హైవేలపై లాంగ్ డ్రైవ్ చేస్తున్నారా.. అయితే ఈ 7 నియమాలు పాటించండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.