యాప్నగరం

బజాజ్ నుంచి మరో కొత్త ‘బాక్సర్’

దేశీ మోటార్‌సైకిల్ దిగ్గజం బజాజ్ ఆటో మరో కొత్త ‘బాక్సర్’ బైక్‌‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది.

TNN 5 Mar 2017, 7:12 pm
దేశీ మోటార్‌సైకిల్ దిగ్గజం బజాజ్ ఆటో మరో కొత్త ‘బాక్సర్’ బైక్‌‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. బజాజ్ నుంచి వచ్చిన 100సీసీ బాక్సర్ మోటార్‌సైకిల్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే చాలా కాలం తరవాత దీనిలో మార్పుచేర్పులు చేసి బాక్సర్ 150సీసీని తీసుకొచ్చింది. అయితే ఈ బైక్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో ఇప్పుడు కొత్తగా ‘బాక్సర్ ఎక్స్150 క్రాస్’ పేరుతో అడ్వంచర్ బైక్‌ను బజాజ్ తీసుకొస్తోంది. ఇటీవల దీనికి రోడ్ టెస్ట్ కూడా నిర్వహించారు.
Samayam Telugu bajaj boxer x150 cross spied testing in india for the first time
బజాజ్ నుంచి మరో కొత్త ‘బాక్సర్’


పాత బాక్సర్‌ లుక్‌తో పెద్దగా మార్పులేమీ చేయనప్పటికీ కొత్త బ్లాక్ ఎల్లాయ్ వీల్స్, అడ్వంచర్ లుక్ ఈ కొత్త బాక్సర్ ఎక్స్150 క్రాస్ సొంతం. అడ్వంచర్‌కు తగ్గట్లుగా క్రితం కంటే వెడల్పాటి టైర్లను అమర్చారు. 144.8 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తున్న ఈ కొత్త బాక్సర్‌లో 4 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. అయితే ఈ బైక్ ఇప్పటికే జాంబియా, కెన్యాతో పాటు పలు అంతర్జాతీయ మార్కెట్లలో లభిస్తోంది. అయితే భారత మార్కెట్‌లో ఎప్పుడు విడుదల చేయనున్నారనే విషయంపై బజాజ్ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.