యాప్నగరం

ఫీల్డర్ టోపీ మ్యాచ్‌నే మార్చేసిందే..!

మైదానంలో ఫీల్డర్ క్యాచ్ అందుకునే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి క్రికెట్ ప్రపంచానికి

TNN 19 Apr 2017, 9:03 am
మైదానంలో ఫీల్డర్ క్యాచ్ అందుకునే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి క్రికెట్ ప్రపంచానికి మంగళ వారం రాత్రి తెలిసొచ్చింది. ఐపీఎల్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హిట్టర్ క్రిస్‌గేల్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద గుజరాత్ లయన్స్ ఫీల్డర్ బ్రెండన్ మెక్‌కలమ్ అద్భుత రీతిలో డైవ్ చేసి క్యాచ్‌గా అందుకున్నాడు. కానీ.. రిప్లై పరిశీలించిన అంపైర్ దాన్ని సిక్స్‌గా ప్రకటించాడు. కారణం ఫీల్డర్ వేసుకున్న టోపీ క్యాచ్ సమయంలో బౌండరీ లైన్ తాకడమే. దీంతో అప్పటి వరకు పెవిలియన్‌కి వెళ్లేందుకు సిద్ధమైన క్రిస్‌గేల్ (77: 38 బంతుల్లో 5x4, 7x6) నూతనుత్తేజంతో మళ్లీ క్రీజులోకి వచ్చి భారీ సిక్సర్లతో విరుచుకుపడగా.. వికెట్ దక్కిన ఆనందంతో ఉన్న గుజరాత్ లయన్స్ జట్టు నిరాశతో కుంగిపోయింది.
Samayam Telugu brendon mccullum denied stunning chris gayle catch by his sun hat
ఫీల్డర్ టోపీ మ్యాచ్‌నే మార్చేసిందే..!



మ్యాచ్‌లో క్రిస్‌గేల్‌తో పాటు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి (64: 50 బంతుల్లో 7x4, 1x6) అర్ధశతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 213 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకి దిగిన గుజరాత్ లయన్స్‌ జట్టు ఓపెనర్ మెక్‌కలమ్ (72: 44 బంతుల్లో 2x4, 7x6) దూకుడుగా ఆడటంతో ఛేదనలో బెంగళూరుకు గట్టి పోటీనిచ్చినట్లు కనిపించినా చివరికి 192/7కే పరిమితమైంది. 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్రిస్‌గేల్‌కి జీవనదానం లభించకుండా ఉన్నట్లయితే.. బెంగళూరు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది. చివరికి బెంగళూరు గెలిచింది 21 పరుగుల తేడాతోనే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.