యాప్నగరం

బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణ పన్నుల వాటా ఇదీ!

కేంద్ర పన్నుల వాటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఎంతెంత లభించింది?

TNN 1 Feb 2018, 10:00 pm
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ నిరసన సెగలు రేగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు, ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. అధికార తెదేపా నేతల్లో సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. అయితే, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి లభించిన వాటాలను పరిశీలిస్తే.. తెలంగాణ కంటే మెరుగ్గా ఉండటం గమనార్హం.
Samayam Telugu andhra pradesh telangana share in central taxes
బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణ పన్నుల వాటా ఇదీ!


కేంద్ర పన్నుల్లో వాటాగా ఆంధ్రప్రదేశ్‌‌కు రూ.33,929.84 కోట్లు, తెలంగాణకు రూ.19,207.43 కోట్లు దక్కనున్నాయి. 4వ ఆర్థిక సంఘం సూచలన మేరకు ఏటా రాష్ట్రాల నుంచి వచ్చే పన్నుల మొత్తంలో రాష్ట్రాల నుంచి వసూలైన కేంద్ర పన్నుల రాబడిలో 42శాతం వాటాను ఆయా రాష్ట్రాలకు తిరిగి ఇస్తారు.

ఏపీ పన్నుల వాటాలో దేనికెంత?

కార్పొరేట్‌ పన్ను మొత్తం రూ.9526 కోట్లు
ఆదాయపన్ను మొత్తం రూ.8430 కోట్లు
కేంద్ర జీఎస్టీ మొత్తం రూ.10,919 కోట్లు
సుంకాల మొత్తం రూ.1671 కోట్లు
కేంద్ర ఎక్సైజ్‌ పన్నులు రూ.1628 కోట్లు

తెలంగాణ వాటాలో
కార్పొరేట్‌ పన్ను మొత్తం రూ.5381 కోట్లు
ఆదాయపన్ను మొత్తం రూ.4772 కోట్లు
కేంద్ర జీఎస్టీ మొత్తం రూ.6181 కోట్లు
సుంకాల మొత్తం రూ.946 కోట్లు
కేంద్ర ఎక్సైజ్‌ పన్నులు 946 కోట్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.