యాప్నగరం

Tax Slabs : పన్ను చెల్లింపుదారులను క్షమాపణలు కోరిన నిర్మలా, ట్విటర్‌లో పేలుతోన్న జోక్స్

పన్ను శ్లాబులలో ఎలాంటి కోతలను తేనందుకు పన్ను చెల్లింపుదారులకు క్షమాపణ చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పన్ను చెల్లింపుదారులు ఆశలను అడియాసలు చేస్తూ.. వ్యక్తిగత పన్ను రేట్లలో, శ్లాబులలో ఎలాంటి కోతలుండవని నిర్మలా సీతారామన్ నేటి బడ్జెట్‌లో ప్రకటించారు.

Samayam Telugu 1 Feb 2022, 6:07 pm
పన్ను శ్లాబులలో ఎలాంటి కోతలను తేనందుకు పన్ను చెల్లింపుదారులకు క్షమాపణ చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పన్ను చెల్లింపుదారులు ఆశలను అడియాసలు చేస్తూ.. వ్యక్తిగత పన్ను రేట్లలో, శ్లాబులలో ఎలాంటి కోతలుండవని నిర్మలా సీతారామన్ నేటి బడ్జెట్‌లో ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పన్ను రేట్లను 2 నుంచి 5 శాతం వరకు తగ్గిస్తే.. కొత్త పన్ను విధానంలోకి మారాలని 45 శాతం మంది పన్ను చెల్లింపుదారులు అనుకున్నారు. కానీ వారి అంచనాలను కేంద్ర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ తలకిందులు చేశారు.
Samayam Telugu Nirmala sitharaman (Pic Credit : TOI)


మరోవైపు కరోనా మహమ్మారితో, ద్రవ్యోల్బణంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోన్న మధ్య తరగతి ప్రజలు స్టాండర్డ్ డిడక్షన్ పెంపు ఉంటుందని భావించారు. ఈ డిడక్షన్‌ను కూడా నిర్మలమ్మ పెంచలేదు. దీంతో ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ కూడా రూ.50 వేలుగానే ఉంది.

Also Read : క్రిప్టో కరెన్సీలకు బ్యాడ్‌న్యూస్.. పన్ను కట్టాల్సిందేనని తేల్చి చెప్పిన బడ్జెట్
నవ్వులు పూయిస్తోన్న మీమ్స్...
ఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించకపోవడంతో ట్విటర్‌లో మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి. అయితే పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరటనివ్వని కేంద్ర ప్రభుత్వం.. క్రిప్టో కరెన్సీలపై 30 శాతం పన్నును విధించింది. క్రిప్టో కరెన్సీల వంటి డిజిటల్ అసెట్స్‌ను కొన్నా.. అమ్మినా వాటిపై 30శాతం పన్ను చెల్లించాల్సిందేనని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.







Also Read : డైమండ్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బడ్జెట్.. సంతోషంతో వెలిగిన మహిళా ఎంపీలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.