యాప్నగరం

Budget 2022: కన్జూమర్లపై నేరుగా ప్రభావం చూపే నిర్ణయాలివే..

మధ్య తరగతి ప్రజలకు, వేతన జీవులకు పెద్దగా ఈ బడ్జెట్‌లో ఒరిగే నిర్ణయాలేమీ లేవు. ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆదాయపు పన్ను కోతలకు కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొండిచేయి చూపారు. అయితే సమీక్షించిన రిటర్నులను దాఖలు చేసుకునేందుకు మాత్రం రెండేళ్ల సమయం ఇచ్చారు.

Samayam Telugu 2 Feb 2022, 2:39 pm

ప్రధానాంశాలు:

  • విలువైన రాళ్లు, వజ్రాలపై డ్యూటీ తగ్గింపు
  • ఖరీదైనదిగా మారనున్న ఇమిటేషన్ జ్యూవెల్లరీ
  • వాల్‌నట్స్ ధరలు పెరగనున్నాయ్
  • వచ్చే ఎండా, వానాకాలల్లో గొడుగులు కొనడం కష్టమే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Budget (Pic Credit : TOI)
మధ్య తరగతి ప్రజలకు, వేతన జీవులకు పెద్దగా ఈ బడ్జెట్‌లో ఒరిగే నిర్ణయాలేమీ లేవు. ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆదాయపు పన్ను కోతలకు కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొండిచేయి చూపారు. అయితే సమీక్షించిన రిటర్నులను దాఖలు చేసుకునేందుకు మాత్రం రెండేళ్ల సమయం ఇచ్చారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని తాము అదనంగా ఎలాంటి పన్ను భారాన్ని మోపలేదని, కోవిడ్ చికిత్స కోసం సాయం చేసిన కంపెనీలపై లేదా బంధువులపై ఎలాంటి పన్నును విధించడం లేదని పేర్కొన్నారు. అంతేకాక కరోనా సమయంలో ఎవరైనా మరణిస్తే.. వారి కుటుంబానికి వచ్చే రూ.10 లక్షల పరిహారాలపై కూడా ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదని చెబుతూ ఉపశమనం ఇచ్చారు. అయితే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం కన్జూమర్లపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. అవేమిటో ఓసారి చూద్దాం...
  • విలువైన రాళ్లు, మెరుగుపెట్టిన వజ్రాలపై కస్టమ్ డ్యూటీని 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీంతో డైమండ్లు కాస్త చౌకగా లభ్యం కానున్నాయి. హాఫ్ క్యారెట్ సాలిటైర్ వజ్రం ఖరీదు ప్రస్తుతం రూ.1.3 లక్షలుగా ఉంది. కస్టమ్ డ్యూటీ తగ్గించిన తర్వాత దీని ధర రూ.2500 తగ్గనుంది.
  • ఇక నుంచి ఇమిటేషన్ జ్యూవెల్లరీని ధరించడం ఖరీదైనదిగా మారనుంది. వీటిపై ప్రభుత్వం కేజీకి రూ.400 కస్టమ్ డ్యూటీని విధించనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం రూ.100కు దొరికే ఈ జ్యూవెల్లరీ.. రూ.250 వరకు పెరగనుంది.
  • దిగుమతి చేసుకునే వాల్‌నట్స్‌పై కూడా ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని పెంచింది. 10 శాతం నుంచి 30 శాతానికి ఈ దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతో 250 గ్రాముల వాల్‌నట్స్ ధర రూ.449 నుంచి రూ.515కు పెరిగింది.
  • ఎండాకాలంలో ఎండ వేడి నుంచి, వర్షాకాలంలో వర్షాల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది గొడుగులు కొంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం వీటి రేట్లు పెరగనున్నాయి. దిగుమతి చేసుకునే గొడుగులపై కస్టమ్ డ్యూటీని 10 శాతం నుంచి 20 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గొడుగుల ధరలు కూడా పెరగనున్నాయి.
  • దిగుమతి చేసుకునే అట్లాంటిక్ సాల్మన్‌లపై ఇంపోర్టు డ్యూటీని ప్రభుత్వం 10 శాతం నుంచి 30 శాతం పెంచింది. దీంతో ప్రస్తుతం రూ.1795గా ఉన్న 450 గ్రాముల సాల్మన్ ధర, మరో రూ.265 వరకు పెరగనుంది.
Also Read : Digital Gold : 30 శాతం పన్ను వీటికి వర్తిస్తుందా...? కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.