యాప్నగరం

Budget 2023: బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యత.. ఏ రంగాలు ఉన్నాయంటే?

Budget 2023: వచ్చే వార్షిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అమృత కాలంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌ అని పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్ రూపొందించడంలో ఏడు అంశాలను ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు. ఆ అంశాలేమిటే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 1 Feb 2023, 11:39 am
Budget 2023: ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అమృత కాలంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌గా పేర్కొన్నారు. భారత దేశం తలెత్తుకుని నిలబడుతోందని, డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయన్నారు. సమష్టి ప్రగతి దిశగా భారత్ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్ రూపొందిచడం ఏడు కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఆ అంశాలేమిటే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Samayam Telugu Budget 2023
బడ్జెట్ 2023


బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించిన అంశాలు

  1. సమ్మిళిత అభివృద్ధి
  2. చివరి మైలు వరకు సంకేమం చేరుకోవడం
  3. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
  4. గ్రీన్ గ్రోత్
  5. యువశక్తి
  6. ఆర్థిక రంగం
  7. అన్‌లీషింగ్ పొటెన్షియల్
ప్రాధాన్యం కల్పించిన అంశాల్లో ముఖ్యాంశాలు..

  • వ్యవసాయం కోసం డిజిటల్ మౌలిక సదుపాయాలు
  • వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెటింగ్ సౌకర్యాలు
  • వ్యవసాయ స్టార్టప్స్‌కు చేయుతూ, ప్రత్యేక నిధి ఏర్పాటు
  • రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానిక చర్యలు
  • పత్తి సాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు, పత్తి కోసం ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం
  • ఆత్మ నిర్భర్ భారత్ క్లీన్ పథకం ఉద్యానవ పంటలకు చేయూత
  • చిరుధాన్యాల పంటలకు సహకారం. ఇందుకోసం శ్రీ అన్న పథకం, రాగులు, జొన్నలు, సజ్జలు, తదితర పంటలకు ప్రోత్సాహం.


Also Read: Nirmala Sitaraman: కేంద్ర బడ్జెట్‌కు వేళాయే.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డులివే.. ఎవరికి సాధ్యం కాని రీతిలో..!

కేంద్ర బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్.. రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న నిర్మలా సీతారామన్
రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.