యాప్నగరం

బడ్జెట్‌ 2018: విద్యాభివృద్ధికి ప్రాధాన్యం

దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి జైట్లీ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యవస్థలో మార్పు తీసుకువస్తామన్నారు.

TNN 1 Feb 2018, 2:03 pm
బడ్జెట్‌లో విద్యాభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యతను ఇచ్చింది. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యవస్థలో మార్పు తీసుకువస్తామన్నారు. ఉపాధ్యాయులతోనే నాణ్యమైన విద్యను అందించే అవకాశం ఉంటుందని... అందుకే స్కూల్‌ టీచర్ల శిక్షణకు ప్రత్యేక శిక్షణా తరగతుల్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యాభివృద్ధికి జిల్లాలవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
Samayam Telugu education budget 2018
బడ్జెట్‌ 2018: విద్యాభివృద్ధికి ప్రాధాన్యం


గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు జైట్లీ. వడోదరలో రైల్వే విశ్వ విద్యాలయం... కొత్తగా 18 ఆర్కిటెక్చర్‌ కాలేజీలును ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఇంట్రిగ్రేటెడ్ బీఈడీని కోర్సును కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు. డిజిటల్‌ విద్యావిధానానికి మరింత చేయూతనిస్తామని... విద్యారంగంలో మౌలిక అభివృద్ధికి రూ.లక్షకోట్లతో రైజ్‌ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ ఏడాది నుంచి పీఆర్‌ఎఫ్‌ (ప్రధానమంత్రి రిసెర్చ్‌ ఫెలోషిప్‌) అమలు చేస్తామని చెప్పారు ఆర్థికమంత్రి . టాప్‌ వెయ్యి మంది బీటెక్‌ విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు... అన్ని రాష్ట్రాలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. బీటెక్ చదివే విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నవాళ్లని గుర్తించి... వారు ఐఐటీ, ఐఐఎస్‌లలో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు జైట్లీ. వారికి ప్రత్యేకంగా ఫెలోషిప్‌లను అందించి ప్రోత్సహిస్తామని... వారు వారానికి ఒకసారి ఉన్నత విద్యాసంస్థల్లో భోధించేలా కొంత సమయాన్ని కేటాయిస్తారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.