యాప్నగరం

పెట్రో ధరలపై బడ్జెట్ ఎఫెక్ట్

కేంద్ర బడ్జెట్‌తో వాహనదారులకు ఊరట కలగబోతోంది. బ్రాండెండ్, అన్‌ బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్‌పై సుంకాన్ని తగ్గిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఈ ఎఫెక్ట్‌తో పెట్రోల్, డీజిల్‌పై 2 రూపాయలు తగ్గే అవకాశం కనిపిస్తోంది.

TNN 1 Feb 2018, 4:13 pm
కేంద్ర బడ్జెట్‌తో వాహనదారులకు కాస్త ఊరట కలగబోతోంది. బ్రాండెండ్, అన్‌ బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్‌పై సుంకాన్ని తగ్గిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఇదే జరిగితే పెట్రోల్, డీజిల్‌పై 2 రూపాయలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. బ్రాండెడ్ పెట్రోల్‌పై విధిస్తున్న రూ.7.66 ఎక్సైజ్ సుంకం... రూ.5.66కు తగ్గనుంది. అన్ బ్రాండెడ్ పెట్రోలపై కూడా ప్రస్తుతం విధిస్తున్న రూ.6.48 ఎక్సైజ్ సుంకం 4.48 రూపాయలకు తగ్గుతుంది
Samayam Telugu petrol diesel will be cheaper
పెట్రో ధరలపై బడ్జెట్ ఎఫెక్ట్


ఇక బ్రాండెడ్ డీజిల్‌ విషయానికొస్తే రూ.10.69 ఎక్సైజ్ సుంకం రూ.8.69కు తగ్గే అవకాశం ఉంది. అన్ బ్రాండెడ్ డీజిల్‌పై లీటర్‌కు విధిస్తున్న రూ.8.33 ఎక్సైజ్ సుంకం రూ.6.33కు తగ్గనుంది. లీటర్‌కు రూ.2 చొప్పున రేట్లు కనుక తగ్గితే వాహనదారులకు కొంత ఊరట కలిగే అంశమనే చెప్పాలి. అలాగే జనవరి మూడో వారంలో పెట్రో ధరలు కొన్ని చోట్ల రూ.80కి చేరింది. ఈ రేట్లు కనుక తగ్గితే ఆ రాష్ట్రాల్లో కూడా కాస్త ఉపశమనాన్ని కలిగించినట్లే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.