యాప్నగరం

బడ్జెట్ 2017: స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగొచ్చు!

కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు కొంచెం ఎక్కువ ఖర్చుచేయాల్సి ఉంటుంది.

TNN 1 Feb 2017, 5:19 pm
కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు కొంచెం ఎక్కువ ఖర్చుచేయాల్సి ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ మేరకు సూచన ప్రాయంగా పేర్కొంది. బడ్జెట్‌లో తీసుకున్న కొత్త నిర్ణయాల కారణంగా మొబైల్ ఫోన్లలో వాడే ప్రింటెడ్ సర్య్కూట్ బోర్డుల (PCBs) ధరలు పెరగనున్నాయి. ఈ పీసీబీల ధర స్మార్ట్‌ఫోన్ ధరలో 25 నుంచి 30 శాతం వరకు ఉంటుంది. కాబట్టి వీటి ధరలు పెరిగితే ఆటోమేటిక్‌గా స్మార్ట్‌ఫోన్ ధరలు కూడా పెరగడం ఖాయం.
Samayam Telugu union budget 2017 smartphones may become costlier
బడ్జెట్ 2017: స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగొచ్చు!


పీసీబీల దిగుమతిపై అదనంగా 2 శాతం ప్రత్యేక సుంకాన్ని విధిస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఇవి విదేశాల నుంచి భారత్‌కు అధికంగా దిగుమతి అవుతున్నాయి. దేశీ పరిశ్రమల మనుగడను కాపాడటానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా పీసీబీలను తయారుచేస్తున్న కంపెనీలకు లాభం చేకూరేందుకే దిగుమతిపై సుంకం విధుస్తున్నట్లు అరుణ్ జైట్లీ చెప్పారు. ఏదేమైనా ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌లను మార్చేసే మొబైల్ ప్రేమికులకు ఇది చేదు వార్తే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.