యాప్నగరం

టెలినార్: రూ.103కే 2 నెలల ఉచిత డేటా, ఫ్రీ కాల్స్!

మార్కెట్‌లోకి జియో ఏ ముహూర్తాన అడుగుపెట్టిందో అప్పటి నుంచి మొబైల్ వినియోగదారులను ఇతర టెలికమ్ సంస్థలు కూడా ఆఫర్లతో ఊరిస్తున్నాయి.

TNN 14 Apr 2017, 2:01 pm
మార్కెట్‌లోకి జియో ప్రవేశంతో టెలికమ్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంతలా అంటే అప్పటి వరకు వినియోగదారుల జేబులను కొల్లగొట్టిన ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ సంస్థలు తాము కూడా తక్కువే కాదంటూ కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. డేటా ఖర్చులతో సతమతమయ్యే వారికి జియో ఎంట్రీ ఓ వరంలా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. ఇతర కంపెనీలు భారీ ఎత్తున్న డేటా ఆఫర్లు ప్రకటించేలా చేసింది. ఇప్పటికే చాలా కంపెనీలు డేటా రేట్లను భారీగా తగ్గించగా, తాజాగా మరో సంస్థ కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Samayam Telugu  telenor unlimited 4g data for 60 days at just rs 103
టెలినార్: రూ.103కే 2 నెలల ఉచిత డేటా, ఫ్రీ కాల్స్!



కేవలం రూ.103 రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత కాలింగ్, 4జీ డేటాను అందించనున్నట్లు టెలినార్ తెలిపింది. టెలినార్ వినియోగదారులు తమ నెంబర్ పై రూ.103తో రీఛార్జ్ చేసుకుని ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది. ఈ ఆఫర్ కింద అపరిమిత 4జీ డేటా‌ను 60 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. అలాగే అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కూడా 90 రోజులు వాడుకోవచ్చని తెలియజేసింది. రూ.103 ఆఫర్ కింద కొత్త 4జీ వినియోగదారులకు రూ.25 ఉచిత టాక్ టైమ్‌తోపాటు నిమిషానికి 25 పైసలు కాల్ ఛార్జ్ మాత్రమే వసూలు చేస్తుంది.

అంతే కాకుండా అపరిమతి 4జీ డేటా రోజుకు 2జీబీ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. 2జీబీ డేటా పరిమితి దాటిపోతే స్పీడ్ 128కేబీపీఎస్ కు పడిపోతుందని తెలిపింది. టెలినార్ 4జీ సేవలు అందుబాటులో ఉన్న అన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్ అమలవుతుందని కంపెనీ పేర్కొంది. మరోవైపు జియో ప్రైమ్ సభ్యత్వ గడువు కూడా రేపటితో ముగియనుంది. సమ్మర్ ఆఫర్ స్థానంలో జియో ధన్ ధనా ధన్ ప్లాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.