యాప్నగరం

పల్సర్ 200ఎన్ఎస్ బైక్ బుకింగ్స్ షురూ..

బజాజ్ పల్సర్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ సంస్థ కొత్త పల్సర్‌ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. 2017 పల్సర్ 200ఎన్ఎస్ మోడల్‌

TNN 28 Jan 2017, 10:02 am
బజాజ్ పల్సర్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ సంస్థ కొత్త పల్సర్‌ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. 2017 పల్సర్ 200ఎన్ఎస్ మోడల్‌ గురించి ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా బజాజ్ విపరీతంగా ప్రచారం చేసింది. వెయ్యి రూపాయల టోకెన్ అడ్వాన్స్ తీసుకొని డీలర్లు ఈ బైక్ బుకింగ్‌లను కూడా ప్రారంభించారు. ఫిబ్రవరి మొదటి వారంలో లేదా రెండో వారంలో బైక్‌ను డెలివరీ చేస్తామని వారు చెబుతున్నారు. ముంబై‌లో ఈ బైక్ ఆన్ రోడ్ ధర రూ.1,16,200గా ఉంది. పాత మోడళ్లతో పోలిస్తే.. కొత్త బైక్‌ మరింత స్పోర్టియర్‌గా కనిపిస్తోంది. ఈ బైక్‌ల 199.5 సీసీ ఇంజిన్‌ను వాడారు. పల్సర్ ఏఎస్ సిరీస్ తరహాలోనే ఇందులోనూ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, 4 వాల్వ్, ట్రిపుల్ స్పార్క్ ఇంజిన్‌ను ఉపయోగించారు. భారత్ స్టాండర్డ్ -4 ప్రమాణాలను అందుకునేలా ఈ బైక్ ఉంటుందని అంచనా.
Samayam Telugu 2017 bajaj pulsar 200ns bookings started
పల్సర్ 200ఎన్ఎస్ బైక్ బుకింగ్స్ షురూ..


2017 బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 మోడల్‌ను గతంలో టర్కీలో ప్రదర్శించారు. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీకి దీటుగా బజాజ్ ఈ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. కొత్త బైక్‌లో బాడీ గ్రాఫిక్స్‌ను మెరుగుపరిచారు. డిఫరెంట్ అల్లాయ్ వీల్స్‌తో ఉన్న ఈ బైక్ దాదాపు ఆర్ఎస్ 200 మోడల్ ఫీచర్లనే కలిగి ఉంది. ఈ బైక్‌లో 280 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 230 ఎంఎం బ్యాక్ డిస్క్‌లను ఏర్పాటు చేశారు. ఈ బైక్ 2017 మిల్లీమీటర్ల పొడవు, 1075 ఎంఎం ఎత్తు ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.