యాప్నగరం

Kawasaki: ఫెస్టివ్ సీజన్‌: కవాసకి కొత్త బైక్‌.. ధరెంతో తెలుసా?

కొత్తగా విడుదల చేసిన 2019 ఎడిషన్‌ బైక్‌లో పెద్దగా మెకానికల్‌ మార్పులు లేకపోవడంతో ధరలో ఎలాంటి మార్పు చేయలేదని కంపెనీ వెల్లడించింది

Samayam Telugu 15 Oct 2018, 11:40 am
ప్రముఖ ద్విచక్ర వాహనాల ఉత్పత్తుల సంస్థ ఇండియా కవాసకి మోటార్‌(ఐకేఎం) మరో సరికొత్త బైక్‌ను విపణిలోకి తీసుకొచ్చింది. పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వర్సీస్‌ 650 2019 ఎడిషన్‌ను నేడు విడుదల చేసింది. దీని ధర రూ. 6.69లక్షలు(ఎక్స్‌షోరూం దిల్లీ)గా నిర్ణయించింది. కాగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వర్సీస్‌ 650 కూడా ఇదే ధరకు లభిస్తోంది. కొత్తగా విడుదల చేసిన 2019 ఎడిషన్‌ బైక్‌లో పెద్దగా మెకానికల్‌ మార్పులు లేకపోవడంతో ధరలో ఎలాంటి మార్పు చేయలేదని కంపెనీ వెల్లడించింది.
Samayam Telugu kawasaki


కాకపోతే.. తాజా ఎడిషన్‌లో సరికొత్త రంగుల్లో బైక్‌లను విడుదల చేశారు. ఇక ఈ బైక్‌లో 649 సీసీ, ప్యారలల్ ట్విన్‌, లిక్విడ్‌ కూల్‌ ఇంజిన్‌ 67.4బీహెచ్‌పీ పవర్‌, 64ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 21లీటర్ల ఇంధన ట్యాంక్‌ గల ఈ బైక్‌ బరువు 216 కిలోలు. కంపెనీ షోరూంలో ఇప్పటికే ఈ బైక్‌ బుకింగ్‌లు ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.