యాప్నగరం

Gautam Adani: అదానీకి దెబ్బ మీద మరో దెబ్బ.. అస్సలు కోలుకోనివ్వని NSE, BSE.. మళ్లీ నిఘా షురూ!

Gautam Adani: దిగ్గజ పారిశ్రామిక వేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. స్టాక్ మార్కెట్లలో పుంజుకోవడానికి అవకాశం లేకుండా NSE, BSE కీలక ప్రకటనలు చేస్తున్నాయి. తాజాగా మరోసారి అదానీ గ్రూప్ స్టాక్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 24 Mar 2023, 3:15 pm
Gautam Adani: గౌతమ్ అదానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ పవర్ స్టాక్‌ను (Adani Power Stock) మరోసారి NSE, BSE.. నిఘా జాబితాలోకి చేర్చింది. షార్ట్ టర్మ్ అడిషనల్ సర్వీలెన్స్ మెజర్ (ASM) ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తీసుకొచ్చాయి. ఇది ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది. అదానీ పవర్ .. షార్ట్ టర్మ్ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్ (ASM Framework) స్టేజ్-1 పరిధిలోకి మార్చి 23 నుంచి వస్తుందని ఈ మేరకు NSE, BSE స్టాక్ ఎక్స్చేంజీల్లో ఒక సర్క్యులర్ కనిపించింది. అయితే.. ఈ స్వల్పకాలిక అదనపు నిఘా అంటే.. అదానీ గ్రూప్‌పై ఆంక్షలు విధించడం మాత్రం కాదని అర్థం చేసుకోవాలి. అయితే.. ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఇది ఇన్వెస్టర్లను అప్రమత్తం చేయడం అన్న మాట. ఆ స్టాక్‌లో షార్ట్ సెల్లింగ్ చేయాలనుకునేవారికి కూడా మార్జిన్ ఎక్కువగా ఉంటేనే ట్రేడింగ్ చేసేందుకు వీలుంటుంది. దీంతో కొంత మేర ఆ స్టాక్‌తో జాగ్రత్తగా ఉండాలని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లే.
Samayam Telugu adani power stock


ఈ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకొచ్చే ముందు.. స్టాక్ ఎక్స్చేంజీలు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఇందులో హై- లో వేరియేషన్, క్లయింట్ కాన్సంట్రేషన్, నంబర్ ఆఫ్ Price Band Hits, Close to Close ప్రైస్ వేరియేషన్, ప్రైస్ ఎర్నింగ్ రేషియోను పరిశీలిస్తాయి. అదానీ ఎంటర్‌‌ప్రైజెస్, అదానీ విల్మర్ లిమిటెడ్ స్టాక్స్‌తో మార్చి 17నే అదానీ పవర్ స్టాక్ ASM పరిధి నుంచి బయటికి వచ్చింది. వీటిని మార్చి 9న ఈ జాబితాలో చేర్చాయి. అయితే మళ్లీ వారం ముగియక ముందే ఇప్పుడు అదానీ పవర్‌ను మళ్లీ ఆ జాబితాలో చేర్చడం గమనార్హం.

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మళ్లీ పుంజుకుంటున్నాయి. గత 20 రోజులుగా లాభాల్లోనే ముగుస్తున్నాయి. క్రితం సెషన్‌లోనూ అదానీ గ్రూప్‌కు చెందిన 10 స్టాక్స్‌లో 8 లాభాల్లోనే ముగిశాయి. ఇక ఒక దశలో ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో కూడా 2వ స్థానం నుంచి 40కి పడిపోయిన అదానీ.. మళ్లీ టాప్-30లోకి ప్రవేశించారు.

Vijay Mallya: సంక్షోభంలోనూ వందల కోట్ల ఆస్తులు కొన్న విజయ్ మాల్యా.. అన్నీ అక్కడే.. CBI రిపోర్ట్‌లో విస్తుపోయే నిజాలు..! Hindenburg Research: మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్.. ఇప్పుడు అదానీని మించి ఉంటుందంటూ వార్నింగ్.. టార్గెట్ ఎవరు?

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.