యాప్నగరం

ఇక జియో ఉద్యోగుల వంతు!

ఉచిత అపరిమిత 4జీ సర్వీసులతో ఒక్కసారిగా టెలీకాం వినియోగదారులందరినీ తనవైపు తిప్పుకున్న రిలయన్స్ జియో ఇప్పుడు తమ ఉద్యోగులకు నజరానాలు ప్రకటించనుంది.

TNN 10 Jan 2017, 4:04 pm
ఉచిత అపరిమిత 4జీ సర్వీసులతో ఒక్కసారిగా టెలీకాం వినియోగదారులందరినీ తనవైపు తిప్పుకున్న రిలయన్స్ జియో ఇప్పుడు తమ ఉద్యోగులకు నజరానాలు ప్రకటించనుంది. ఈ మేరకు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు వాటాలు కల్పించేందుకు జియో యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఎదుగుదల కోసం, వినియోగదారులను ఆకర్షించడంలో బాగా కష్టపడిన ఉద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తు్న్నట్లు సమాచారం.
Samayam Telugu after customers reliance jio now plans to reward its employees
ఇక జియో ఉద్యోగుల వంతు!


రిలయన్స్ జియోలో ప్రస్తుతం 30వేలకు పైగా పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. అయితే మొదటి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు వాటాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో పెద్ద టెలీకాం సంస్థలుగా కొనసాగుతున్న భారతీ ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ ఇండియా కూడా ఉద్యోగులు వాటాలు కల్పించడానికి చూస్తున్నాయి. ఈ మేరకు ఎంప్లాయి స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ESOPs)ను ప్రవేశపెట్టనున్నాయి.

సాధారణంగా ఎసోప్స్‌ను సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. ఉద్యోగి వేతనంలో 10 నుంచి 200 శాతం వరకు వాటా కల్పిస్తారు. అయితే జియో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇదే ఆలోచనలో ఉందట. కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌కి వారి వేతనంలో 10 నుంచి 15 శాతం వరకు వాటాలు కేటాయించాలని చూస్తుందట. దీంతో ఆయా ఉద్యోగులు ఖుషీ అవుతున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.