యాప్నగరం

విమాన ప్రయాణికులకు షాక్.. టికెట్ ధరలకు రెక్కలు

దిగ్గజ విమానయాన సంస్థలు ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్ ఫిబ్రవరి నుంచి చూస్తే దాదాపు 200 ఫ్లైట్స్‌ను రద్దు చేశాయి. ముంబై ఎయిర్‌పోర్ట్ రన్‌వే మరమత్తులు, జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక ఇబ్బందులు, ఇండిగో పైలెట్ల సర్దుబాటు వంటి పలు అంశాలు ఇందుకు కారణం.

Samayam Telugu 11 Mar 2019, 5:19 pm

ప్రధానాంశాలు:

  • దాదాపు 20 శాతం పెరిగిన టికెట్ ధరలు
  • అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే సమస్య లేదు
  • చివరి నిమిషంలో టికెట్ బుకింగ్ చేసుకుంటే చుక్కలే

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu flight
విమాన ప్రయాణం మళ్లీ భారం కానుందా? పరిస్థితులను చూస్తుంటే అలానే అనిపిస్తోంది. దాదాపు 200 ఫ్లైట్స్ రద్దు కావడంతో విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పైకి కదిలాయి. జనవరితో పోలిస్తే ప్రస్తుతం టికెట్ ధరలు బాగా పెరిగాయి. మరీముఖ్యంగా ఢిల్లీ-ముంబై వంటి ప్రధాన రూట్లలో ధరలు ఆకాశానంటుతున్నాయి.
దిగ్గజ విమానయాన సంస్థలు ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్ ఫిబ్రవరి నుంచి చూస్తే దాదాపు 200 ఫ్లైట్స్‌ను రద్దు చేశాయి. ముంబై ఎయిర్‌పోర్ట్ రన్‌వే మరమత్తులు, జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక ఇబ్బందులు, ఇండిగో పైలెట్ల సర్దుబాటు వంటి పలు అంశాలు ఇందుకు కారణం.

ఇటీవల ముంబై-ఢిల్లీ ఫ్లైట్ టికెట్ ధర ఏకంగా రూ.20,000 వరకు చేరింది. ఇతర రూట్లలోనూ ధరలు పెరిగాయి. అడ్వాన్స్ టికెట్లను బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ధరల పెంపు ప్రభావం తెలియకపోవచ్చు. అయితే చివరి నిమిషంలో టికెట్లను బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం చుక్కలు కనిపించి ఉంటాయి.

గత కొన్ని నెలలుగా విమాన ప్రయాణం చేసేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. పెళ్లిళ్ల సీజన్, పండుగల సీజన్ వంటి అంశాలు ఇందుకు కారణం. దీంతో ఒకవైపు ప్రయాణికులు పెరుగుతూ ఉంటే.. మరోవైపు ఫ్లైట్ సర్వీసులు తగ్గుతూ వచ్చాయి. విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెరగడానికి ఇది కూడా కారణమే. గతేడాదితో పోలిస్తే ధరలు దాదాపు 20 శాతం మేర పెరిగాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.