యాప్నగరం

మహిళా సిబ్బందితో ప్రపంచాన్ని చుట్టొచ్చిన ఎయిర్ ఇండియా విమానం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో భారతీయ విమానయాన సంస్థ, ఎయిర్ ఇండియా ఓ సరికొత్త...

TNN 5 Mar 2017, 4:17 pm
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో భారతీయ విమానయాన సంస్థ, ఎయిర్ ఇండియా ఓ సరికొత్త ప్రపంచ రికార్డ్ సృష్టించింది. పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన ఓ విమానం భూగోళాన్ని చుట్టొచ్చే అవకాశం కల్పించి మహిళామణులపట్ల సంస్థ తన గౌరవాన్ని చాటుకుంది. ఫిబ్రవరి 27న ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకి టేకాఫ్ అయిన ఫ్లైట్.. ప్రపంచాన్ని చుట్టేసిన అనంతరం తిరిగి శుక్రవారం మళ్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
Samayam Telugu air india has operated a flight around the world with an all women crew
మహిళా సిబ్బందితో ప్రపంచాన్ని చుట్టొచ్చిన ఎయిర్ ఇండియా విమానం


శాన్‌ఫ్రాన్సిస్కోకి వెళ్లేటప్పుడు పసిఫిక్ సముద్రంపై నుంచి వెళ్లిన బోయింగ్ 777-200LR విమానం తిరుగు ప్రయాణంలో అట్లాంటిక్ సముద్రం గగనతలంపై నుంచి రిటర్న్ అవడం ద్వారా భూగోళాన్ని చుట్టేసొచ్చింది. ఎయిర్ ఇండియా సాధించిన ఈ ఘనతని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కోసం దరఖాస్తు పంపించినట్టు తాజాగా ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. పసిఫిక్ సముద్రం గగనతలంపై మార్గంలో వెళ్లడం ద్వారా 3 గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది. అలా వెళ్లిన మొట్టమొదటి ఇండియన్ ఫ్లైట్ క్యారియర్ కూడా ఎయిర్ ఇండియానే ఆపరేట్ చేయడం విశేషం.

కాక్‌పిట్, క్యాబిన్ క్రూ కాకుండా చెక్-ఇన్, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఎయిర్ క్రాఫ్ట్‌ని సర్టిఫై చేసిన ఇంజనీర్స్, ఎయిర్ క్రాఫ్ట్ వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేసిన సిబ్బంది అందరూ మహిళలే కావడం ఈ రికార్డ్ వెనుకున్న ప్రత్యేకత. మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్స్‌లోనూ ఇదే తరహాలో సేవలు అందించాలని భావిస్తోంది ఎయిర్ ఇండియా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.