యాప్నగరం

Air India: ఎయిరిండియా గుడ్‌న్యూస్.. ఆ మార్గాలలో అదనపు విమానాలు, హైదరాబాద్‌కి కూడా.. !

Air India: విమాన టిక్కెట్ ధరలపై ఉన్న పరిమితిని ఏవియేషన్ మంత్రిత్వ శాఖ బుధవారమే తొలగించింది. దీంతో ఇక విమానయాన సంస్థలు విమాన టిక్కెట్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో ఎయిరిండియా సరికొత్తగా 24 అదనపు విమానాలను నడిపేందుకు సిద్ధమైంది. ఈ కొత్త విమానాలు ఈ నెల 20 నుంచే ఎగరనున్నాయి. ఎయిరిండియా నడిపే కొత్త విమానాలలో ముంబై నుంచి మన హైదరాబాద్‌కి కూడా ఒకటి ఉంది.

Authored byKoteru Sravani | Samayam Telugu 11 Aug 2022, 8:27 pm

ప్రధానాంశాలు:

  • ఎయిరిండియా సరికొత్తగా 24 అదనపు విమానాలు
  • ఆగస్టు 20 నుంచి రాకపోకలు ప్రారంభం
  • ముంబై నుంచి హైదరాబాద్‌కి కూడా విమానం
  • ఎయిరిండియా వద్ద 70 ఎయిర్‌క్రాఫ్ట్‌లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Air India
ఎయిరిండియా కొత్త విమానాలు
Air India: దేశీయ ప్రయాణికులకు శుభవార్త. దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా సరికొత్తగా 24 అదనపు విమానాలను నడపనుంది. ఆగస్టు 20 నుంచి ఈ అదనపు విమానాల రాకపోకలను ప్రారంభిస్తామని ఎయిరిండియా తెలిపింది. కొత్తగా నడిపే 24 విమానాల్లో.. రెండు కొత్త ఫ్రీక్వెన్సీలున్నాయి. ఢిల్లీ నుంచి ముంబైకి, ఢిల్లీ నుంచి బెంగళూరుకి, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కి ఈ విమానాలు ఎగరనున్నాయి. అలాగే ముంబై నుంచి చెన్నైకి, ముంబై నుంచి హైదరాబాద్‌కి నడుస్తాయి. ముంబై నుంచి బెంగళూరు రూట్‌లో, అహ్మదాబాద్ నుంచి పూణే రూట్‌లో కూడా కొత్త విమానాలు నడుస్తాయని ఎయిరిండియా తెలిపింది.
గత ఆరు నెలలుగా, తాము తమ భాగస్వాములతో కలిసి పని చేస్తున్నామని ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ అన్నారు. తమ ఎయిర్‌క్రాఫ్ట్‌లను మళ్లీ సర్వీసుల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఎయిరిండియా వద్ద 70 ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి. వాటిలో 54 మాత్రమే ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయి. మిగిలిన 16 ఎయిర్‌క్రాఫ్ట్‌లు 2023 ప్రారంభం నుంచి సర్వీసుల్లోకి రానున్నాయి.

సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ విమానయాన టిక్కెట్ ధరల పరిమితిపై ఉన్న ఆంక్షలను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న ఒక్క రోజులోనే ఎయిరిండియా ఈ నిర్ణయం ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఆంక్షలు తొలగించడంతో టిక్కెట్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిరిండియా, విస్తారా, స్పైస్‌జెట్, ఇండిగో, గోఫస్ట్ లాంటి సంస్థలు టిక్కెట్ ధరలను పెంచేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా సమయంలో టిక్కెట్ ధరలు పెరగకుండా.. కనిష్ట, గరిష్ట ధరలను ప్రభుత్వమే నిర్ణయించింది. దీంతో విమానయాన సంస్థలు పరిమితికి మించి ధరలు పెంచడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు ఈ ఆంక్షలను తొలగించింది.

Also Read : చైనా రాఖీలను దెబ్బ కొట్టిన సోదరీమణులు.. బిజినెస్‌లు భారీగా ఢమాల్!

Also Read : ఉద్యోగులకు కనీస వేతనం రూ.64 లక్షలు.. ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకునే అవకాశం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.