యాప్నగరం

జియో 19... ఎయిర్‌టెల్ 9...?

జియోకు దీటుగా ఎయిర్‌టెల్ కూడా ఆఫర్లను ప్రవేశ పెడుతూనే ఉంది. ఇందులో భాగంగా... రూ.9 రీఛార్జ్‌ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.

TNN 17 Feb 2018, 4:39 pm
భారత టెలికాం రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ నేపథ్యంలో... టెల్కోలు తమ వినియోగదారులను రోజుకో ఆఫర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సంచలన టెలికామ్ సంస్థ జియో తన ఆఫర్లతో ఇప్పటికే... తన పోటీదార్లను ముప్పుతిప్పలు పెడుతోంది. ఎయిర్‌టెల్ కూడా జియోకు దీటుగా ఆఫర్లను ప్రవేశ పెడుతూనే ఉంది. ఇందులో భాగంగా... రూ.9 రీఛార్జ్‌ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఒక్కరోజు కాలపరిమితితో ఈ ఆఫర్‌ను లాంచ్ చేసింది. యూజర్లు మై ఎయిర్‌టెల్ యాప్, ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ద్వారా కొత్త ప్లాన్‌ను పొందవచ్చు. కాంబో ఆఫర్ విభాగంలో ఈ రీచార్జ్ ప్యాక్ అందుబాటులో ఉంటుంది.
Samayam Telugu airtel launched rs 9 plan
జియో 19... ఎయిర్‌టెల్ 9...?



రిలయెన్స్ జియో రూ.19 ప్లాన్‌కు పోటీగా అతి తక్కువ రీఛార్జ్‌ ఆఫర్‌ను ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద.. రూ.9తో రీఛార్జ్ చేసుకున్నవారు... రోజులో అన్‌లిమిటెడ్ కాల్స్‌, 100 ఎంబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. రోజులో గరిష్ఠంగా.. 250 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి. ఎయిర్‌టెల్ మరిన్ని ప్లాన్లను ప్రవేశ పెట్టే యోచనలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.