యాప్నగరం

'అమెజాన్' డిస్కౌంట్ సేల్‌కు విశేష స్పందన!

అమెజాన్ రెండు రోజుల క్రితం ప్రకటించిన భారీ డిస్కౌంట్ ఆఫర్లకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఆఫర్ మరో ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉండనుండటంతో కస్టమర్లు అమెజాన్ బాట పట్టారు.

TNN 9 Apr 2018, 5:09 pm
అమెజాన్ రెండు రోజుల క్రితం ప్రకటించిన భారీ డిస్కౌంట్ ఆఫర్లకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఆఫర్ మరో ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉండనుండటంతో కస్టమర్లు అమెజాన్ బాట పట్టారు. డిస్కౌంట్ ఆఫర్లతోపాటు క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా ప్రకటించడంతో వినియోగదారులు బాగా ఆకర్షితులయ్యారు. 'సమ్మర్ కార్నివాల్' పేరుతో ఈ సేల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu Amazon2


వస్తువుల కొనుగోళ్లపై 40 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఏసీలపై 35 శాతం, ఫ్రిజ్‌లపై 25 శాతం, టీవీలపై 40 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది. కొన్ని వస్తువులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లతోపాటు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌‌లను కూడా అందిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేసినవారికి 10 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఏప్రిల్ 10తో ఈ సూపర్ సేల్ ముగియనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.