యాప్నగరం

Adani Hindenburg Row: హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. అదానీ షేర్ల పతనం.. భారత్‌తో సవాల్ వద్దంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. అసలేమైంది?

Adani Hindenburg Row: అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ సంచలన రిపోర్ట్‌తో (Hindenburg Research) అదానీ గ్రూప్ (Adani Group) మార్కెట్ విలువ లక్షల కోట్లు నష్టపోయింది. అదానీ సంపద పతనమైంది. ఈ నేపథ్యంలో.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా దీనిపై పరోక్షంగా స్పందించారు. భారత్‌తో ఎప్పుడూ సవాల్ వద్దంటూ ట్వీట్ చేశారు.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 5 Feb 2023, 7:44 am
Adani Hindenburg Row: ప్రస్తుతం దేశంలో గౌతమ్ అదానీ (Gautam Adani)- హిండెన్‌బర్గ్ (Hindenburg Research) వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ ఇటీవల అదానీ గ్రూప్‌పై (Adani Group) సంచలన ఆరోపణలు చేయగా.. అప్పటినుంచి అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలుతున్నాయి. లక్షల కోట్ల మార్కెట్ విలువ పతనం కాగా.. అదానీ సంపద కూడా మంచులా కరిగిపోయింది. ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానం నుంచి ఏకంగా 17కు పడిపోయారు. ఒక దశలో 22వ స్థానానికి చేరారు. అయితే ఈ నేపథ్యంలో.. దిగ్గజ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దీనిపై పరోక్షంగా స్పందించారు.
Samayam Telugu adani shares fall anand mahindra


సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్రా.. ఎప్పుడూ స్ఫూర్తిదాయక కథనాలను, మంచి మంచి విషయాలను హాస్య చతురతతో కూడుకున్న సంగతులను ట్విట్టర్‌లో షేర్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదానీ గ్రూప్‌కు మద్దతుగానే ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. భారత్‌‌కు ఎప్పుడూ సవాల్ విసరొద్దంటూ చురకలు అంటించారు.

అదానీ గ్రూప్ సంచలనం.. ఇన్వెస్టర్లందరికీ తిరిగి డబ్బులు.. అసలేమైంది?

''ప్రస్తుతం వ్యాపార రంగంలో ఎదురవుతున్న సవాళ్లు.. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని చూస్తున్న భారత ఆశయాలను దెబ్బతీస్తాయా? అని అంతర్జాతీయ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. నేను నా జీవితంలో యుద్ధాలు, భూకంపాలు, కరవు కాటకాలు, ఉగ్రదాడులు, ఆర్థిక మాంద్యం పరిస్థితుల్నీ చూశాను. వాటిని చూసిన అనుభవంతో నేను చెప్పేది ఒకటే.. ఎప్పుడూ భారత దేశానికి సవాల్ విసరకండి.'' అని ఆనంద్ మహీందా ట్వీట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో.. మహీంద్రా ఎవరిని ఉద్దేశించి అన్నారు.. అదానీ గ్రూప్‌కు మద్దతుగానే పోస్ట్ చేశారా? ఈ పరిస్థితులకు కారణం అంతర్జాతీయ మీడియానా? అన్న కోణంలో మహీంద్రా ట్వీట్ చేశారా? అని చర్చించుకుంటున్నారు.



బంపర్ ఆఫర్.. టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఒక్కో మోడల్‌పై ఒక్కో తీరు..!

అదానీ గ్రూప్‌.. భారత స్టాక్ మార్కెట్లో తీవ్ర అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందని ఆరోపించింది హిండెన్‌బర్గ్ రీసెర్చ్. దీనిపై రెండేళ్లకుపైగా పరిశోధన చేసి రిపోర్ట్ విడుదల చేసినట్లు పేర్కొంది. ఇదే సమయంలో అదానీ గ్రూప్‌కు 88 ప్రశ్నలు సంధించింది. 2 రోజుల తర్వాత అదానీ గ్రూప్.. దీనిపై 413 పేజీల్లో రెస్పాన్స్ ఇచ్చింది. ఇవి నిరాధార ఆరోపణలు అని, భారతదేశ ఎదుగుదలను చూసి తట్టుకోలేకే.. హిండెన్‌బర్గ్ ఇలా చేసినట్లు అందులో బదులిచ్చింది. అయితే మళ్లీ జాతీయవాదాన్ని అడ్డుపెట్టుకొని.. అదానీ గ్రూప్ మోసాలు చేస్తోందని హిండెన్‌బర్గ్ రిప్లై ఇచ్చింది.
అదానీ వ్యవహారంతో దేశ ప్రతిష్ట దెబ్బతింటోందా? నిర్మలా సీతారామన్ జవాబిదే.!

అయితే హిండెన్‌బర్గ్ రిపోర్ట్ విడుదల అయినప్పటినుంచి.. గౌతమ్ అదానీకి క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకుపైగా పతనమైంది. ఇది భారత కరెన్సీలో రూ.8 లక్షల కోట్లకుపైనే. అదానీ సంపద కూడా సగానికిపైగా పడిపోయింది. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానం నుంచి ఇప్పుడు 17కు పడిపోయారు. ఇక రూ. 20 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో వచ్చిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPO ను కూడా ఉపసంహరించుకుంది అదానీ గ్రూప్. ఇప్పుడు ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసం చూరగొనే ప్రయత్నం చేస్తోంది.


20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read: భారీగా కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. భలే మంచి ఛాన్స్.. ఇవాళ్టి రేట్లు ఇవే..
హిండెన్‌బర్గ్ రిపోర్ట్.. FPO రద్దు.. తొలిసారి నోరు విప్పిన గౌతమ్ అదానీ.. అసలేమైందో చెప్పేశారుగా!
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.