యాప్నగరం

Amul Organic Atta : పాలే కాదు.. ఇక నుంచి పిండి కూడా.. కేజీ ప్యాకెట్ ఎంతంటే?

అమూల్ పాలు ఎంత ఆప్యాయతను దక్కించుకున్నాయో మనకు తెలిసిందే. అమూల్ పాలకు మార్కెట్లో తిరుగే ఉండదు. డెయిరీ ప్రొడక్టులలో సక్సెస్ సాధించిన అమూల్ బ్రాండ్ ఇక నుంచి ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్లోనూ తన చక్రం తిప్పాలని చూస్తోంది. అమూల్ గోధుమ పిండిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ పిండి కేజీ ప్యాకెట్ ధర రూ.60గా ఉంది.

Authored byKoteru Sravani | Samayam Telugu 29 May 2022, 1:52 pm

ప్రధానాంశాలు:

  • మార్కెట్లోకి అమూల్ ఆర్గానిక్ గోధుమ పిండి
  • ఫుడ్ మార్కెట్లోకి ప్రవేశించినట్టు ప్రకటన
  • త్వరలోనే కంది పప్పు, పెసర పప్పు కూడా
  • గోధుమ పిండి కేజీ ప్యాకెట్ ధర రూ.60
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Amul Organic Atta
అమూల్ ఆర్గానిక్ గోధుమ పిండి
Amul Organic Atta : ఇక నుంచి మార్కెట్లో అమూల్ పాలు మాత్రమే కాదు.. అమూల్ పిండి కూడా లభించనుంది. అమూల్ బ్రాండ్ కింద డెయిరీ ప్రొడక్టులను ఆఫర్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్(జీసీఎంఎంఎఫ్) ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్‌లోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. ఆర్గానిక్ గోధుమ పిండిని మార్కెట్లోకి లాంచ్ చేయడం ద్వారా అమూల్ గ్రోసరీ మార్కెట్లో అడుగు పెట్టినట్టు తెలిపింది.
అమూల్ ఆర్గానిక్ గోధుమ పిండి పేరుతో తన తొలి ప్రొడక్టులను లాంచ్ చేసినట్టు జీసీఎంఎంఎఫ్ తెలిపింది. ఈ వ్యాపారాల కింద పెసర పప్పు, కంది పప్పు, శనగ పప్పు, బాస్మతి బియ్యాన్ని కూడా త్వరలోనే మార్కెట్లోకి తేనున్నట్టు పేర్కొంది. ఆర్గానిక్ రైతులందర్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి, పాలను ఎలాగైతే సేకరిస్తున్నామో, అలాగే ఈ ప్రొడక్టులను కూడా సేకరిస్తామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి తెలిపారు. దీని వల్ల సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు.

మార్కెట్‌‌తో రైతులను అనుసంధానించడమే సవాలు..
అయితే ఆర్గానిక్ టెస్టింగ్ సౌకర్యాలతో రైతులను అనుసంధానించడం అతిపెద్ద సవాలని సోధి చెప్పారు. ఈ టెస్టింగ్ సౌకర్యాలు కాస్త ఖరీదైనవిగా ఉంటాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాలలో ఆర్గానిక్ టెస్టింగ్‌ ల్యాబోరేటరీస్‌ను ఏర్పాటు చేస్తోంది. అలాంటి ఒక ల్యాబోరేటరీని అహ్మదాబాద్‌లోని ‘అమూల్ ఫెడ్ డెయిరీ’ వద్ద నెలకొల్పుతోంది.

జూన్ తొలి వారం నుంచి ఆర్గానిక్ గోధుమ పిండి గుజరాత్‌లోని అన్ని అమూల్ పార్లర్స్, రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటుందని అమూల్ డెయిరీ చెప్పింది. జూన్ నుంచి గుజరాత్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, పూణేలో ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. కేజీ గోధుమ పిండి ధర రూ.60 కాగా.. ఐదు కేజీల ధర రూ.290గా కంపెనీ పేర్కొంది.

Also Read : జూన్ 1 నుంచి మారే అంశాలివే..! ఇక ప్రజల జేబులకు చిల్లులేAlso Read : Currency Notes : రూ.500, రూ.2000 నోట్లు తీసుకుంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.