యాప్నగరం

Apple Layoffs: రిక్రూటర్లపై వేటు వేసిన ఐఫోన్ దిగ్గజం.. రోజుకో టెక్ కంపెనీ బ్యాడ్‌న్యూస్

Apple Layoffs: టెక్ కంపెనీలు వరుసగా లేఆఫ్స్ బాట పట్టాయి. ఒక కంపెనీ తర్వాత మరో కంపెనీ ఉద్యోగుల వేటును ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ లాంటి కంపెనీలు ఉద్యోగుల లేఆఫ్స్ ప్రకటించగా.. తాజాగా మరో కంపెనీ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత వాల్యూబుల్ టెక్ దిగ్గజం ఆపిల్. అయినప్పటికీ మున్ముందు రాబోయే ఆర్థిక పరిస్థితులను, వ్యాపార అవసరాలను పరిగణనలోకి తీసుకుని, ముందస్తుగానే కొందరు ఉద్యోగులను తీసేసినట్టు రిపోర్టులు వస్తున్నాయి.

Authored byKoteru Sravani | Samayam Telugu 16 Aug 2022, 10:45 am

ప్రధానాంశాలు:

  • వరుసగా లేఆఫ్స్ బాట పట్టిన టెక్ కంపెనీలు
  • కాంట్రాక్టు రిక్రూటర్లను తొలగించిన ఆపిల్
  • రాబోయే పరిస్థితులకు ముందస్తుగానే సిద్ధం
  • నెమ్మదించిన కంపెనీ వ్యాపారాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Apple Layoffs
ఆపిల్ లేఆఫ్స్
Apple Layoffs: రోజుకో టెక్ కంపెనీ బ్యాడ్‌న్యూస్ చెబుతోంది. తాజాగా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన ఆపిల్ సైతం తన ఉద్యోగులకు షాకిచ్చింది. గత వారంలో కాంట్రాక్టు ఆధారితంగా పనిచేసే రిక్రూటర్లను ఆపిల్ తొలగించేసింది. ఈ టెక్ దిగ్గజం నియామకాలను, ఖర్చులను తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వంద మంది కాంట్రాక్టు ఉద్యోగులను కంపెనీకి రావొద్దని ఆపిల్ చెప్పినట్టు సంబంధిత వ్యక్తులు చెప్పారు. ఈ రిక్రూటర్లు ఆపిల్ కంపెనీకి కొత్త ఉద్యోగులను నియమించడంలో బాధ్యత వహిస్తున్నారు. కానీ కంపెనీ వ్యాపారాలు నెమ్మదించడంతో.. రిక్రూటర్లను సైతం ఆపిల్ తొలగించేసింది.
ఆపిల్ ప్రస్తుత వ్యాపార అవసరాలు మారుతున్న నేపథ్యంలో వీరిని తొలగించినట్టు సంబంధిత వ్యక్తులు చెబుతున్నారు. చాలా కాలం తర్వాత ఆపిల్ కంపెనీ నియామకాలను తగ్గించినట్టు గత నెలలోనే బ్లూమ్‌బర్గ్ రిపోర్టు చేసింది. ప్రస్తుతం ఆపిల్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. లేఆఫ్స్ విషయంలో ఇతర టెక్ కంపెనీల సరసన ఆపిల్ కూడా నిలిచినట్టయింది. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి కంపెనీ నిర్ణయం తీసుకుంటుందని ఆపిల్ ఫలితాల ప్రకటన సందర్భంగా కాన్ఫరెన్స్ కాల్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ తెలిపారు. కొన్ని విభాగాల్లో పెట్టుబడులను కొనసాగించనున్నప్పటికీ... ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించనున్నట్టు పేర్కొన్నారు.

ఆపిల్‌లో ప్రస్తుతం ఎవరైతే ఫుల్ టైమ్ రిక్రూటర్లుగా బాధ్యతలను నిర్వహిస్తున్నారో వారిని అలానే ఉంచుకుంది. కానీ కాంట్రాక్ట్ రిక్రూటర్లను మాత్రం తొలగించింది. ఈ నిర్ణయంపై మాట్లాడేందుకు ఆపిల్ అధికార ప్రతినిధి నిరాకరించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొంటూ ఉండటంతో.. చాలా టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ బాట పట్టాయి. ఇప్పటికే మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్, టెస్లా ఇంక్, మైక్రోసాఫ్ట్ కార్ప్, అమెజాన్ డాట్ కామ్ ఇంక్, ఒరాకిల్ కార్పొరేషన్లు ఉద్యోగులను తొలగించాయి.

Also Read : Petrol Diesel Prices: భారీగా పతనమైన క్రూడాయిల్ ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లెలా ఉన్నాయి?

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.